Site icon NTV Telugu

US: హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ సర్కార్ షాక్.. నిధులు నిలిపివేత

Us

Us

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ గట్టి షాకిచ్చింది. యూనివర్సిటీకి అందించే 2.2 బిలియన్‌ డాలర్ల ఫెడరల్‌ నిధులను నిలిపివేసింది. హార్వర్డ్ యూనివర్సిటీ యూదు మతానికి వ్యతిరేకంగా పని చేస్తోందని.. హమాస్ మద్దతుగా కార్యకలాపాలు కొనసాగిస్తుందని వైట్‌హౌస్ ఆరోపించింది. జో బైడెన్ పదవీకాలంలో అనేక యూనివర్సిటీల్లో హమాస్‌కు మద్దతుగా ఆందోళనలు జరిగాయి. అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌నకు వ్యతిరేకంగా హార్వర్డ్ యూనివర్సిటీ పని చేసిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. దీంతో యూనివర్సిటీకి ట్రంప్ ప్రభుత్వం నిధులకు కత్తెర వేసింది. హార్వర్డ్‌తో పాటు పలు యూనివర్సిటీలు ఉన్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Polavaram Project: రేపటి నుంచి పోలవరంలో పర్యటించనున్న కేంద్ర నిపుణుల బృందం..

ఇక ట్రంప్ నిర్ణయాలను హార్వర్డ్ యూనివర్సిటీ యాజమాన్యం తప్పుపట్టింది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానం చేసింది. ఇక హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్, విద్యార్థులు, అధ్యాపకులు రాసిన లేఖలో ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. ‘‘ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వమూ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఏమి బోధించవచ్చో, ఎవరిని చేర్చుకోవాలో, ఎవరిని నియమించుకోవాలో, ఏ అధ్యయనం చేయాలో నిర్దేశించకూడదు.’’ అని గార్బర్ అన్నారు.

ఇది కూడా చదవండి: Physical Harassment: తిరుపతి శిల్పారామంలో లైంగిక వేధింపుల కలకలం

Exit mobile version