India-Canada: ట్రూడోని చూసి ఇండియాలో నవ్వుకుంటున్నారు.. కెనడా ప్రతిపక్ష నేత విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై అక్కడి ప్రజలు, ప్రతిపక్ష నేతలు తీవ్ర అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. ఇప్పటికే కెనడా ‘హౌసింగ్ సంక్షోభం’లో కూరుకుపోయింది. అక్కడి ప్రజలకు ఉండటానికి ఇళ్లు దొరకని పరిస్థితి ఉంది. మరోవైపు ఉగ్రవాదులు, గ్యాంగ్ స్టర్లకు కెనడా స్వర్గధామంగా మారింది. రాజకీయ కారణాల వల్ల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖలిస్తానీ వేర్పాటువాదులకు మద్దతుగా నిలుస్తున్నారు. దీని కారణంగా కెనడా-ఇండియాల మధ్య దౌత్య వివాదం రగులుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా కెనడా కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నేత పియరీ పొయిలీవ్రే, కెనడా ప్రధాని జస్టిన ట్యూడోపై సంచనల వ్యాఖ్యలు చేశారు. కెనడా-ఇండియా మధ్య దౌత్యవివాదానికి నిందించారు. భారతదేశంలో ట్రూడోని చూసి నవ్వుకుంటున్నారని, భారత్ లో ఆయన ‘లాఫింగ్ స్టాక్’గా మారారని ఆయన అన్నారు. నేపాలీ మీడియా సంస్థ నమస్తే రేడియో టొరంటోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘‘భారతదేశంలో ట్రూడో ఒక లాఫింగ్ స్టాక్ గా పరిగణించబడుతున్నారు-ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్యం’’ అని ఆయన అన్నారు.
Also Read
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
- Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
Read Also: Tiger Nageswararao :టైగర్ నాగేశ్వరరావు టూ డేస్ కలెక్షన్స్ ఎంతంటే..?
కెనడియన్ దౌత్యవేత్తలను దేశం విడిచిపెట్టి వెళ్లమని భారత్ కోరడంపై స్పందిస్తూ.. ట్రూడో అసమర్థుడు, అన్ ప్రొఫెషనల్ అంటూ దుయ్యబట్టారు. కెనడా ఇప్పుడు భారత్ తోనే కాకుండా ప్రపంచంలోని ప్రధాన శక్తులతో తగాదాలు పెట్టుకుందని ఆయన అన్నారు. తాను కెనడా ప్రధాని అయితే భారత్ తో సంబంధాలు పునరుద్ధరిస్తానని అన్నారు. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తి, ఒకరితో ఒకరు మంచి సంబంధాలు కలిగి ఉండటం అవసరం అని ఆయన అన్నారు. కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పియరీ తెలిపారు.
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ని జూన్ నెలలో కెనడాలో గుర్తుతెలియని వ్యక్తుల చంపేశారు. అయితే ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అంతే కాకుండా సీనియర్ భారత దౌత్యవేత్తను కెనడా నుంచి బహిష్కిరించారు. భారత్ కూడా కెనడియన్ దౌత్యవేత్తను బహిష్కరించింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని భారత్ విమర్శించింది. ఈ నేపథ్యంలో ఇటీవల భారత్ లోని 41 మంది కెనడా దౌత్వేత్తలను ఉపసంహరించుకోవాలని భారత్ కెనడాను కోరింది. లేకపోతే వారికున్న రక్షణలను తొలగిస్తామని హెచ్చరించింది. చేసేందేం లేక కెనడా తన దౌత్యవేత్తలను ఉపసంహరించుకుంది.
తాజావార్తలు
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
-
YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
-
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!