Site icon NTV Telugu

Modi-Trump: తుది దశకు వాణిజ్య చర్చలు.. ట్రంప్-మోడీ సంభాషణతో ఫైనల్ అయ్యే ఛాన్స్!

Usindia

Usindia

భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం చర్చలు తుది దిశకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ-ట్రంప్ మధ్య సంభాషణ జరిగిన తర్వాత జూలై 9కి ముందు ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని వర్గాలు పేర్కొన్నాయి.

అధికారుల స్థాయిలో చర్చలు ముగిశాయని.. కానీ మోడీ-ట్రంప్ మధ్య జరిగే రాజకీయ దిశానిర్దేశం తర్వాత ఒక క్లారిటీ వస్తుందని చర్చల్లో పాల్గొన్న వ్యక్తి వెల్లడించారు. రెండు వైపులా చర్చలు ముగిశాయని.. రెండు దేశాల అధినేతల చర్చల తర్వాతే ఫైనల్ అయ్యే ఛాన్సుందని వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ సమావేశం ఎప్పుడు జరుగుతుందనేది సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం మోడీ ఐదు దేశాల పర్యటనలో ఉన్నారు. ఎప్పుడు ట్రంప్-మోడీ మాట్లాడుకుంటారనే దానిని బట్టే వాణిజ్య ఒప్పందం ఫైనల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Modugula Venugopala Reddy: 2029 ఎన్నికలలో మొట్టమొదట గెలిచేది దేవినేని అవినాషే!

అయితే భారత్‌లో వ్యవసాయం, పాడి శ్రమకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయితే ప్రాముఖ్యమైన భారతీయ రంగాలను దెబ్బ కొట్టేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో మోడీ సర్కార్ వెనుకంజ వేస్తోంది. పశుగ్రాసంలో ఉపయోగించే కొన్ని జన్యుపరంగా మార్పు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను అనుమతించాలనే అమెరికా అభ్యర్థనపై భారత్ వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య చర్చలు ఫైనల్‌కు రాలేదని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Minimum Balance Charges: మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందా?.. అయితే గుడ్ న్యూస్!

వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని భారత సంధానకర్తల బృందం.. ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ వాణిజ్య ప్రతినిధి బృందంతో తీవ్రమైన చర్చల్లో పాల్గొంది. జూన్ 5-10 మధ్య భారతదేశం-అమెరికా ఒక రౌండ్ చర్చలు జరిపాయి. ట్రంప్ విధించిన 26 శాతం సుంకాల నుంచి భారత్ ఉపశమనం పొందాలని చూస్తోంది. వస్త్రాలు, తోలు, పాదరక్షలు వంటి ఎగుమతులకు సుంకాల రాయితీ కోసం భారత్ ప్రయత్నిస్తోంది. ఇక జూన్ 27న మరోసారి భారత్ బృందం అమెరికాకు వెళ్లి వారం పాటు చర్చలు జరిపింది. ఈ చర్చలన్నీ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఎప్పుడు ఫైనల్ ప్రకటన వస్తుందో ఉత్కంఠ నెలకొంది.

అయితే తాజాగా డెడ్‌లైన్ దగ్గర పడుతుండడంతో ఆయా దేశాలకు అమెరికా లేఖలు పంపిస్తోంది. ఇదే అంశంపై విలేకర్ల సమావేశంలో ప్రస్తావించారు. ఆగస్టు 1 నుంచి వాణిజ్య దేశాలు సుంకాలు చెల్లించాల్సిందేనని.. ఈ మేరకు శుక్రవారం నుంచి లేఖలు పంపిస్తున్నట్లు తెలిపారు. ఇక రాబోయే కొద్ది రోజుల్లో అయితే అదనపు లేఖలు కూడా వస్తాయని పేర్కొ్న్నారు. వాణిజ్య భాగస్వామ దేశాలకు సుంకాల రేట్లను తెలియజేస్తూ లేఖలు ప్రారంభించినట్లు వెల్లడించారు. శుక్రవారం 10-12 దేశాలకు లేఖలు అందుతాయని.. 60-70 శాతం, 10-20 శాతం వరకు సుంకాలు ఉంటాయని పేర్కొన్నారు.

జూలై 9లోగా దేశాలు ఒప్పందాలు చేసుకోకపోతే అధిక రేట్లు విధిస్తామంటూ గతంలో ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. ఇప్పటి వరకు యూకే, వియత్నాం ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక చైనా కూడా పరస్పరం సుంకాలు తగ్గించుకునేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక భారతదేశంతో అమెరికా ఒప్పందాన్ని కుదుర్చుకోగలదని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Exit mobile version