NTV Telugu Site icon

Chocolate: ప్రముఖ చాక్లెట్‌పై షాకింగ్ న్యూస్.. ఇకపై తినే ముందు జాగ్రత్త!

Chocolate

Chocolate

చాక్లెట్ అంటే పిల్లల దగ్గర నుంచి అన్ని వయసుల వారు ఇష్టపడని వాళ్లు ఉండరు. అది కనిపిస్తే చాలు.. లాలాజలం ఊరిపోతుంది. అంతగా ఇష్టపడేవాళ్లుంటారు. కనీసం రోజుకు ఒకటైనా తినకుండా ఉండరు. అంతగా ఇష్టపడి తినే చాక్లెట్ గురించి తాజాగా ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ షాకింగ్ న్యూస్ తెలియాలంటే ఈ వార్త చదవండి.

ప్రముఖ కోకో ఉత్పత్తుల నుంచి తయారయ్యే ఆహారాల్లో సీసం, కాడ్మియం వంటి విషపూరిత భారీ లోహాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ఈ మేరకు అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో తేటతెల్లమైంది. డార్క్ చాక్లెట్‌తో సహా 72 కోకో ఆధారిత ఆహారాలను ఎనిమిది సంవత్సరాల పాటు పరిశోధకులు నిశితంగా పరిశీలించిన తర్వాత ఈ మర్మం బయటపడింది. ఈ ఉత్పత్తుల్లో 43 శాతం సీసం, 35 శాతం కాడ్మియం అధికంగా ఉన్నట్లు గుర్తించింది. ఇది గుండె.. ఇతర అవయవాలకు ప్రమాదమని తేల్చింది.

కోకో ఉత్పత్తుల్లో విష పదార్థాలు గుర్తించినట్లుగా ప్రధాన పరిశోధకుడైన లీ ఫ్రేమ్ వెల్లడించారు. ఈయన జీడబ్ల్యూ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ హెల్త్ సైన్సెస్‌లో ఇంటిగ్రేటివ్ మెడిసిన్ డైరెక్టర్ మరియు క్లినికల్ రీసెర్చ్ అండ్ లీడర్‌షిప్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఆహార పదార్థాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇటువంటి వాటి పట్ల దూరంగా ఉండాలని సూచించారు.

సీసం అధికంగా ఉండడంతో అధిక రక్తపోటు, మెదడు, మూత్రపిండాలు, పునరుత్పత్తి వ్యవస్థకు హాని కలిగించవచ్చని చెప్పారు. అంతేకాకుండా తలనొప్పి, కడుపు తిమ్మిరి, మలబద్ధకం, కండరాలు/కీళ్ల నొప్పి, నిద్రకు ఇబ్బంది, అలసట, చిరాకు, సెక్స్ డ్రైవ్ కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇక కాడ్మియం విషపూరితం కారణంగా చలి, జ్వరం, కండరాల నొప్పికి కారణమవుతుందన్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక ఎక్స్పోజర్ మూత్రపిండాలు, ఎముకలు, ఊపిరితిత్తుల వ్యాధికి దారి తీస్తుందని వెల్లడించారు.