అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సుడిగాలుల తరహాలో విరుచుకుపడే టోర్నడోల కారణంగా కెంటకీ అనే ప్రాంతంలో ఇప్పటికే 100మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కెంటకీ రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషిర్ వెల్లడించారు. కెంటకీ చరిత్రలోనే ఇది అత్యంత బీభత్సమైన టోర్నడో అని గవర్నర్ తెలిపారు. ఒక్క మేఫీల్డ్ నగరంలోనే కొవ్వత్తుల పరిశ్రమ పైకప్పు కూలి దాదాపు 50 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: పాముతో పరాచకాలాడితే ఇలాగే ఉంటుంది.. వీడియో వైరల్
మరోవైపు ఇల్లినాయిస్‌లోని అమెజాన్ గిడ్డంగిలో 100మంది సిబ్బంది చిక్కుకున్నారు. మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఈ టోర్నడోల ప్రభావంతో చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ అధికారులు సహాయక చర్యలను ప్రారంభించారు. మరోవైపు కెంటకీలో అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. కాగా అమెరికాలోని ఐదు రాష్ట్రాల్లో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అర్కాన్సాస్, ఇల్లినాయిస్ మిస్సౌరీ, టేనస్సీల రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో టోర్నడోల కారణంగా పలు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ నేపథ్యంలో భారీగా నష్టం వాటిల్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
