ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అంతమొందించిన ఇజ్రాయెల్.. తాజాగా జరిపిన దాడిలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులను కూడా హతమార్చింది. గత రాత్రి జరిపిన దాడిలో ఇరాన్ అత్యున్నత భద్రతా అధికారి అలీ లారిజానీ కూడా హతమైనట్లుగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వెల్లడించారు. ఇప్పటికే ఇరాన్ సైన్యాధిపతి సోలేమానీని చంపినట్లుగా ఐడీఎఫ్ వెల్లడించింది. ఇదే ఘటనలో అలీ లారిజాని కూడా చనిపోయినట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇతర ఉన్నతాధికారులను కూడా అంతమొందించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు ఇరాన్ స్పందించలేదు.
అలీ లారిజానీ..
అలీ లారిజాని.. అయతుల్లా అలీ ఖమేనీకి కుడిభుజం లాంటివాడు. దేశ భద్రత, ఇరాన్ అణు కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ది కల్చరల్ రివల్యూషన్‌లోనూ సభ్యుడిగా ఉన్నారు. అలీ ఖమేనీ మరణానంతరం లారిజానీని ఇరాన్‌లో శక్తిమంతమైన నేతగా అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి.
శుక్రవారం టెహ్రాన్‌లో జరిగిన ఖుద్స్ డే ర్యాలీల సందర్భంగా అలీ లారిజాని చివరిసారిగా బహిరంగంగా కనిపించారు. అనంతరం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో సంబంధం ఉన్న 10 మంది వ్యక్తుల జాబితాలో భాగంగా లారిజానీతో సహా సీనియర్ ఇరాన్ సైనిక, గూఢచార అధికారుల గురించిన సమాచారం కోసం అమెరికా 10 మిలియన్ డాలర్ల వరకు బహుమతిని ప్రకటించింది. అలా అమెరికా రివార్డ్ ప్రకటించిన కొద్దిరోజులకే ఇజ్రాయెల్ హతమార్చేసింది.
Israel Defense Forces tweets, "Ali Larijani, Secretary of Iran’s Supreme National Security Council and the regime’s effective leader, has been eliminated." pic.twitter.com/KtSO4ZnN1d
— ANI (@ANI) March 17, 2026
"Eliminated": Israeli Defence Forces confirm death of senior Iran military chief Soleimani
Read @ANI Story | https://t.co/fIQAEdtbgQ#Israel #Iran #Soleimani pic.twitter.com/aIjUwlUNMS
— ANI Digital (@ani_digital) March 17, 2026
