NTV Telugu Site icon

Pakistan: పాకిస్తాన్‌లో మరొకడిని లేపేశారు..

Pakistan Terrorists

Pakistan Terrorists

Pakistan: పాకిస్తాన్ దేశంలో వరసగా భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా హతమవుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు రావడం, ఉగ్రవాదిని పాయింట్ బ్లాక్‌లో కాల్చి చంపేసి అంతే వేగంతో మాయమవ్వడం జరుగుతోంది. ఇప్పటి వరకు భారత వ్యతిరేక ఉగ్రవాదులు 19 మంది ఇలాగే చనిపోయారు. ఆదివారం రోజు లష్కరే తోయిబా ఉగ్రసంస్థకి చెందిన కీలక ఉగ్రవాది హబీబుల్లాని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో కాల్చి చంపారు. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీస్ సయీద్ సన్నిహితుడు అద్నాన్ బాయి హత్య తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం అద్నాన్‌ని ఇలాగే గుర్తు తెలియని వ్యక్తులు కరాచీలో హత్య చేశారు.

Read Also: CM Nitish Kumar: “హిందీ తెలిసి ఉండాలి”.. ఇండియా కూటమి సమావేశంలో డీఎంకే నేతపై ఆగ్రహం..

ఇప్పటికే భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంకి విష ప్రయోగం జరిగినట్లు, అతను ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 1993 ముంబై పేలుళ్ల తర్వాత పరారీలో ఉన్న దావూద్, కరాచీలో అత్యంత కట్టుదిట్టమైన మిలిటరీ ప్రాంతంలో సురక్షితంగా ఉంటున్నాడు. అయితే భారత్ ఎన్నిసార్లు ఆధారాలు సమర్పించినప్పటికీ.. దావూద్ మా దేశంలో లేదని పాక్ బుకాయిస్తోంది.

గత కొంత కాలంగా భారత్ వ్యతిరేక ఉగ్రవాదులే టార్గెట్‌గా పాకిస్తాన్‌లో టెర్రరిస్టుల హత్యలు జరుగుతున్నాయి. కరాచీ, సియాలో కోట్, నీలం వ్యాలీ, పీఓకే, ఖైబర్ ఫఖ్తంఖ్వా, రావల్ కోట్, రావల్పిండి, లాహోర్ ఇలా పాక్‌లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు హతమాయ్యారు. మోటార్ సైకిల్ పై ఇద్దరు వ్యక్తులు రావడం, వెంటనే ఉగ్రవాదిని కాల్చేసి అక్కడి నుంచి పరారవ్వడం జరుగుతోంది. ఇప్పటి వరకు జరిగిన టెర్రరిస్టుల హత్యలన్నీ ఇలానే జరిగాయి. అయితే ఈ కేసుల్లో ఇప్పటి వరకు పాక్ పోలీసులకు ఒక్క ఆధారం లభించలేదు. అయితే దీని వెనక శత్రుదేశాల నిఘా సంస్థ ఉందంటూ.. అక్కడి అధికారాలు పరోక్షంగా భారత ‘రా’ ఏజెన్సీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.