NTV Telugu Site icon

Israel–Hezbollah conflict: హెజ్బొల్లా టాప్ కమాండర్ను లేపేసిన ఇజ్రాయెల్

Hezbolla

Hezbolla

Israel–Hezbollah conflict: వైమానిక, భూతల దాడులతో హెజ్ బొల్లాను ఇజ్రాయెల్ ఉక్కిబిక్కిరి చేస్తోంది. మరోసారి ఆ సంస్థను కోలుకోలేని దెబ్బకొట్టింది టెల్ అవీవ్. హెజ్ బొల్లా టాప్ కమాండర్ ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. నాసర్ బ్రిగేడ్ రాకెట్ మిస్సైల్స్ యూనిట్ కు చెందిన కమాండర్ జాఫర్ ఖాదర్ ఫార్ ను దక్షిణ లెబనాన్ లో హతమార్చినట్లు పేర్కొనింది. ఇజ్రాయెల్ పై చోటు చేసుకున్న పలు రాకెట్ దాడుల వెనక.. జాఫర్ హస్తం ఉన్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) ఆరోపించింది.

Read Also: Bangladesh: 3 నెలల్లో 2000 మందిపై దాడులు.. భద్రత కల్పించాలంటూ హిందువులు డిమాండ్

కాగా, ఇజ్రాయెల్ పై జరిగిన పలు దాడుల వెనక నాసర్ బ్రిగేడ్ రాకెట్ మిస్సైల్స్ యూనిట్ కు చెందిన కమాండర్ జాఫర్ ఖాదర్ ఫార్ ఉన్నాడని ఐడీఎఫ్ అనుమానించింది. మాజ్ దల్ షామ్స్ పై రాకెట్ దాడి ఘటనలో 12 మంది చిన్నారులు మృతి చెందడం.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. గతవారం మెటులా ఘటనలో.. ఐదుగురు ఇజ్రాయెలీలు చనిపోయిన ఘటన వెనకుంది జాఫరేనని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది.

Read Also: CM Chandrababu: ఉచిత ఇసుక విధానం మ‌రింత పార‌ద‌ర్శకంగా అమ‌లు చేయాలి..

అంతేకాకుండా గతేడాది అక్టోబర్ 8వ తేదీన తూర్పు లెబనాన్‌ నుంచి ఇజ్రాయెల్‌పై రాకెట్‌ దాడులను హెజ్‌బొల్లా చేపట్టగా.. జాఫర్ ఆధ్వర్యంలోనే ఆ దాడులు జరిగినట్లు ఐడీఎఫ్‌ చెప్పుకొచ్చింది. ఈ దాడులకు ముందు తూర్పు లెబనాన్‌లో సీనియర్‌ హెజ్‌బొల్లా ఆపరేటివ్‌ను బంధించినట్లు ఇజ్రాయెల్‌ నేవీ అధికారులు చెప్పారు. అయితే, అదుపులోకి తీసుకున్న హెజ్‌బొల్లా ఆపరేటివ్‌ ఎవరనేది ఇప్పటి వరకు వెల్లడించలేదు. మరోవైపు శుక్రవారం బాత్రూన్ లెబనాన్‌కు చెందిన నేవీ కెప్టెన్‌ను కొందరు దొంగలించారు. ఈ ఘటన వెనక ఇజ్రాయెల్‌ పాత్ర ఉందా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు లెబనీస్‌ అధికారులు తెలిపారు.