Site icon NTV Telugu

Las Vegas University: అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి

Untitled 1

Untitled 1

America: అగ్రరాజ్యం అమెరికాలో వరుస కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. అమెరికా వాసులకు గన్ కల్చర్ ను ఫ్యాషన్ గా మారిపోయింది.సాధారణ పౌరుల నుండి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరు పెన్ను కొన్నంత సులువుగా గన్ కొంటారు. ఇక చీమ చిట్టుకుమన్న గోలీమార్ అంటారు. గతంలో అమెరికాలో కాల్పుల్లో ప్రజలు ప్రాణాలను కోల్పోయిన ఘటనలు కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా మరోసారి వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. అమెరికా లోని లాస్‌ వెగాస్‌లో కాల్పుల జల్లు కురిసింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.

Read also:Revanth Reddy: మొత్తం మూడు వేదికలు.. దద్దరిల్లనున్న రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం

ఈ నేపథ్యంలో పోలీసులు మాట్లాడుతూ.. బుధవారం లాస్ వెగాస్ యూనివర్సిటీలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడని.. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. మరో వ్యక్తి గాయపడ్డారని తెలిపారు. అలానే గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని.. కాగా చికిత్స పొందుతున్న వ్యక్తి పరిస్తితి విషమంగా ఉందని పేర్కొన్నారు. కాగా లాస్ వెగాస్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో ఈ కాల్పులు జరిపిన అనుమానితుడు కూడా మరణించినట్లు ప్రకటించారు. అలానే ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇలా కాల్పులు జరగడం అమెరికాలో కొత్తేమీకాదు.

Exit mobile version