Site icon NTV Telugu

తాలిబ‌న్ల ఎంట్రీ.. కాబూల్‌లో హృద‌య విదాక‌ర ఘ‌ట‌న‌లు..

Kabul Airport

ఆప్ఘనిస్థాన్‌ను త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు తాలిబ‌న్లు.. దేశ రాజ‌ధాని కాబూల్ స‌హా.. అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల‌ను.. చివ‌ర‌కు అధ్య‌క్ష భ‌వ‌నాన్ని సైతం స్వాధీనం చేసుకున్నారు.. అక్క‌డ పార్టీ కూడా చేసుకున్నారు.. అయితే, ప్ర‌జ‌లు మాత్రం భ‌యంతో వ‌ణికిపోతున్నారు.. కాబూల్‌లో ప్ర‌ధాన ర‌హ‌దారులు.. వాహ‌నాల‌తో భారీ ట్రాఫిక్‌తో ద‌ర్శ‌న‌మిస్తుండ‌గా.. ఇక‌, ఎయిర్‌పోర్ట్ లో ప్ర‌జ‌ల ర‌ద్దీ పెరిగిపోయింది.. పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు ఎయిర్‌పోర్ట్‌లోకి దూసుకెళ్లారు.. విమానంలో ఎక్కితే చాలు అనే అతృత వారిలో క‌నిపిస్తోంది.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆప్ఘనిస్థాన్‌ నుంచి కాబూల్ విమానాశ్రయానికి పరుగులు తీస్తూ, చీమలదండుల్లా అందుబాటులో ఉన్న విమానాల్లోకి జనం చొచ్చుకుపోతున్న వీడియోలు ఇప్పటికే సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి..

కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో తొక్కిసలాట తరహాలో గందరగోళ ప‌రిస్థితులు నెల‌కొన‌డ‌గా.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.. మిలటరీ విమానంలోకి చొచ్చుకుపోతున్న జనాన్ని నిలువరించేందుకు అమెరికా బలగాలు గాలిలోకి కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో పలువురు మృత్యువాత పడగా, మరికొందరు గాయపడినట్టు చెబుతున్నారు. ఇక‌, విమానాలు ర‌న్‌వేపై టే ఆన్‌కు వెళ్తున్న స‌మ‌యంలోనూ.. దాని వెంట ప‌రుగులు తీస్తున్నారు ప్ర‌జ‌లు.. చివ‌ర‌కు విమానం చ‌క్రాల ద‌గ్గ‌ర అయినా.. చోటు దొరికించుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.. అహిద్ కర్జియా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌‌ నుంచి అప్పుడే కదిలిన విమానం చక్రాలు పట్టుకుని ఎగిరిపోదామనుకున్న ముగ్గురు పౌరులు విమానం గాలిలోకి ఎగురగానే పట్టుజారి కిందకు పడ్డారు. ఆ ముగ్గురూ మృతిచెందిన‌ట్టు స్థానికులు చెబుతున్నారు. ఇలా ఆఫ్ఘ‌నిస్థాన్‌లో హృద‌య విదార‌క ఘ‌ట‌న‌లు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు ఆ వీడియోలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Exit mobile version