Covid-19: ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్-19 ఒక వ్యక్తిలో రెండేళ్ల పాటు ఉండి, కొత్త వేరియంట్‌గా రూపాంతరం చెందిన ఓ కేస్ స్టడీని ఆమ్‌స్టర్‌డామ్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ నివేదించింది. 72 ఏళ్ల వ్యక్తిలో రోగనిరోధక శక్తి లేక కోవిడ్ -19 రికార్డు స్థాయిలో 613 రోజులు ఉంది. లింఫోమా కారణంగా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన సదరు వ్యక్తి కోవిడ్‌ని ఎదుర్కోలేకపోయాడు. టీకాలు తీసుకున్నప్పటికీ, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా కరోనా వైరస్ తప్పించుకోవడానికి వీలు కలిగింది.
Read Also: Kharge: ప్రధాని మోడీకి ఖర్గే 2 పేజీల లేఖ.. దేనికోసమంటే..!
ఈ కేస్ స్టడీ ముఖ్యంగా తక్కువ రోగనిరోధక శక్తి కలిగిన ప్రజలను రక్షించాల్సిన ప్రాముఖ్యతను హైలెట్ చేసింది. టీకాలు వేసుకున్నప్పటికీ, కోవిడ్-19 వల్ల అనారోగ్య సమస్యలతో హాస్పిటల్‌లో చేరాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయని చెప్పింది. ఇలా ఒకే వ్యక్తితో దీర్ఘకాలంగా కరోనా వైరస్ ఉండటం వల్ల ప్రత్యేకమైన వైరల్ వేరియంట్ ఉద్భవించే అవకాశాన్ని ఈ కేసు నొక్కి చెబుతోంది. రోగనిరోధక వ్యవస్థ అణిచివేత దీర్ఘకాలిక అంటువ్యాధులు, సంభావ్య కొత్త వైరల్ వేరియంట్లను ఎలా సృష్టిస్తాయో ఈ అధ్యయనం చెప్పింది.
ప్రస్తుతం ఈ కేసులో SARS-CoV-2 ఇన్ఫెక్షన్ యొక్క వ్యవధి చాలా పెద్దది. సాధారణ ప్రజలతో పోలిస్తే రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉన్న వ్యక్తుల్లో దీర్ఘకాలిక అంటువ్యాధులు ఎక్కువని, అయితే రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉండే జనాభా చాలా తక్కువ శాతం ఉన్నందున దీర్ఘకాలిక అంటు వ్యాధులు చాలా అరుదని పరిశోధకులు చెప్పారు.
