Site icon NTV Telugu

Donald Trump: “అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి”.. మస్క్‌కు ట్రంప్ వార్నింగ్..

Trump Musk

Trump Musk

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిలియనీర్ ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ట్రంప్ సర్కార్ తీసుకువచ్చిన ‘‘బిగ్, బ్యూటిపుల్ బిల్’’పై ఇరువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ట్రంప్ ఎలాన్ మస్క్‌కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వివాదాస్పద బిల్లుకు ఓటు వేసే రిపబ్లిక్లను శిక్షించడానికి ప్రయత్నిస్తే ‘‘తీవ్ర పరిణామాలు’’ ఎదుర్కోవాల్సి ఉంటుందని శనివారం బెదిరించారు.

Read Also: Best Phone Under 20K: 20 వేల లోపు ధర.. బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

ప్రపంచంలో అతిశక్తివంతమైన దేశాధినేత, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడికి మధ్య విభేదాలు రావడంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గతేడాది అమెరికా ఎన్నికల్లో ట్రంప్ కి మస్క్ మద్దతు ప్రకటించడమే కాకుండా, బిలియన్ డాలర్లు ఫండింగ్ చేశాడు. అయితే, ఇప్పుడు వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకున్నాయి. అమెరికా ప్రతిపక్ష పార్టీ అయిన డెమొక్రాట్లకు నిధులు ఇవ్వకూడదని ట్రంప్ మస్క్‌ని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో వాళ్లకు మద్దతు ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అన్నారు.

Exit mobile version