There Will Be No Third World War Says zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ మంగళవారం గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్రధానోత్సవంలో వర్చువల్ గా ప్రసంగించారు. రష్యాతో కొనసాగుతున్న యుద్ధంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి ప్రపంచ యుద్దంలో మిలియన్ల మంది, రెండో ప్రపంచ యుద్ధంలో పది లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని..అయితే మూడో ప్రపంచ యుద్ధం ఉందని ఆయన అన్నారు. రష్యా దురాక్రమణను ఉక్రెయిన్ ఆపుతుందని అన్నారు. 1943లో గోల్డెన్ గ్లోబ్ అవార్డులను ప్రస్తావిస్తూ జెలన్ స్కీ ప్రసంగించారు. యుద్ధంలో ఎవరు గెలుస్తారనేది స్పష్టంగా ఉందని.. అయితే మరికొన్ని యుద్ధాలు, కన్నీళ్లు మిగిలి ఉన్నాయని అన్నారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, జీవించే హక్కు కోసం, ప్రేమించే హక్కు కోసం ఉక్రెయిన్ పోరాడుతోందని.. దీనికి మద్దతు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: RRR: ‘నాటు నాటు…’ సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ పై చిరు ఏమన్నారంటే…
రష్యా, ఉక్రెయిన్ దేశంపై గతేడాది ఫిబ్రవరి నెలలో యుద్ధాన్ని ప్రారంభించింది. దాదాపుగా ఏడాది కాలంగా యుద్ధం కొనసాగుతోంది. అయితే ఇప్పటికీ ఈ యుద్ధానికి ముగింపు పడే అవకాశాలు కనిపించడం లేదు. అమెరికా, నాటో దేశాలు ఇచ్చే ఆర్థిక, సైనిక సహకారంతో రష్యాను ఎదురించి పోరాడుతోంది. ఇటీవల జెలన్ స్కీ అమెరికాలో పర్యటించారు. అమెరికా నుంచి భారీగా ఆర్థిక సాయం, సైనిక సాయాన్ని కోరాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఉక్రెయిన్ తో పాటు నాటో దేశాలకు అమెరికా 3.75 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. దీంతో పాటు పెట్రియాడ్ క్షిపణి వ్యవస్థను అందించనుంది.
https://twitter.com/ThisIsMax/status/1613008870556794883
