NTV Telugu Site icon

Emmanuel Macron: నా పదవికి ఎలాంటి గండం లేదు.. త్వరలోనే కొత్త ప్రధానిని నియమిస్తా..

France

France

Emmanuel Macron: ఫ్రాన్స్‌ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రధాని మిచెల్‌ బార్నియర్‌ సర్కార్ మెజార్టీ సాధించలేదు. ఈ క్రమంలోనే అధ్యక్షుడిగా ఉన్న ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌ సైతం బాధ్యతల నుంచి తప్పుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో తాను అధికార బాధ్యతల నుంచి తప్పుకోను.. త్వరలోనే కొత్త ప్రధాన మంత్రిని నియమిస్తానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఎలిసీ ప్యాలెస్‌ నుంచి ఫ్రాన్స్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మీరు ఐదేళ్లు పాలించమని నాకు అధికారం ఇచ్చారు.. అన్ని వ్యవస్థలను సక్రమంగా నడిపిస్తాను.. ప్రజలను రక్షిస్తూ దేశాన్ని ముందుకు తీసకెళ్లే బాధ్యత నాపై ఉందని మెక్రాన్ చెప్పుకొచ్చారు.

Read Also: Rapo22 : మీలో ఒకడు సాగర్.. రామ్ పోతినేని ఫస్ట్ లుక్ సూపర్బ్

కాగా, సామాజిక సంక్షోభాలు, ద్రవ్యోల్బణం, కరోనా వంటి ఎన్ని అడ్డంకులు వచ్చిన.. వాటిని ఎదుర్కొని ముందుకు కొనసాగుతున్నామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌ తెలిపారు. అసాధ్యమైన వాటిని చేసి చూపించా.. ముందున్న ఈ 30 నెలలు దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని బార్నియర్‌ను మెక్రాన్ కోరారు. అయితే, గత జులైలో ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా అధ్యక్షుడు నియమించారు.

Read Also: Tata Nano EV : టాటా నానో ఈవీ వచ్చేస్తుంది?.. ధర ఎంతంటే?

కానీ, బార్నియర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్రాన్స్ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. దీంతో అసెంబ్లీలో 577 ఓట్లు ఉండగా.. అందులో ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా 331 ఓట్లు వచ్చాయి. ఇక, ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీలో సర్కార్ కి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నెగ్గడం 60 ఏళ్లలో ఇదే మొదటి సారి కావడం గమనార్హం. అయితే, మిచెల్‌ బార్నియర్‌ ప్రధానిగా కేవలం మూడు నెలలు మాత్రమే పదవిలో కొనసాగారు.