అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌కు చెందిన మత్స్యకారుడు జోసెఫ్ క్రామెర్ సముద్రంలో చేపలు, ఎండ్రకాయల వేటకు వెళ్లాడు. మంచి ఆదాయాన్ని ఆర్జించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ అప్పుడు అతడికి ఓ నీలిరంగు ఎండ్రకాయల దొరికింది. అతడి వలలో చిక్కుకుంది. చూడటానికి చాలా అందంగా ఉంది. అది చూస్తే అతడికి తినాలనిపించలేదు. ఈ నీలం రంగు ఎండ్రకాయల శరీరంపై ఊదా, గులాబీ రంగుల చిన్న మచ్చలు కూడా ఉన్నాయి. జోసెఫ్ ఇంతకు ముందు కూడా నీలిరంగు ఎండ్రకాయలను పట్టుకున్నాడు. ఇది వాటి కంటే భిన్నంగా కనిపించింది. దీన్ని సీకోస్ట్ సైన్స్ సెంటర్‌కు తరలించారు. ఇప్పుడు ఇక్కడ ప్రదర్శన కోసం ఉంచారు.
READ MORE: Damodar Raja Narasimha:114 జీవో చూడండి.. హరీష్ రావుకు దామోదర కౌంటర్..
ఎందుకంటే విచారణలో అది కాటన్ మిఠాయి ఎండ్రకాయ అని తేలింది. ఇది చాలా అరుదు. ఇది 10 కోట్ల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కనిపిస్తుంది. ఈ ఎండ్రకాయలు వాటి ఇతర ఎండ్రకాయల వలే గోధుమ, నలుపు లేదా చాక్లెట్ రంగులో లేదు. దీన్ని అంత త్వరగా వేటాడ లేం. ఎందుకంటే సమద్రం నీటిలో సరిగ్గా కనిపించదు. 2018 సంవత్సరం ప్రారంభంలో.. కెనడా తీరంలో జోసెఫ్ ఎండ్రకాయల కంటే లేత రంగు కాటన్ మిఠాయి ఎండ్రకాయలు కనిపించాయి. కానీ అది రంగు జన్యు పరివర్తన వల్ల వచ్చినట్లు నిర్ధారించారు. సాధారణంగా నీటిలో నుంచి గోధుమ రంగులో కనిపించే ఎండ్రకాయలను తీసుకున్నప్పుడు.. వాటి శరీరంపై ఎరుపు, పసుపు, నీలం రంగులు ఉన్నట్లు చూసి ఉంటారు. కొన్నిసార్లు జన్యు పరివర్తన కారణంగా ఒక రంగు మారుతుంది.
READ MORE:Ganja Gang Arrest: తీగ లాగితే కదిలిన డొంక.. గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
పూర్తిగా ఎర్రని ఎండ్రకాయలు 10 మిలియన్ సంవత్సరాకు ఒకసారి కనిపిస్తాయి. పూర్తిగా నారింజ, పసుపు లేదా మిశ్రమ రంగు ఎండ్రకాయలు 3 నుంచి 5 కోట్ల సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తాయి. కానీ కాటన్ క్యాండీ ఎండ్రకాయలు లేదా అల్బినో ఎండ్రకాయలు 10 కోట్ల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కనిపిస్తాయి. ఇది జోసెఫ్ క్రామెర్‌కు భారీ శుభవార్త అయ్యింది.