NTV Telugu Site icon

Israel PM Netanyahu: తమ బందీలను వదిలేస్తే రేపే యుద్ధం ముగిస్తా..

Isreal

Isreal

Israel PM Netanyahu: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. అక్టోబరు 7నాటి దాడుల సూత్రధారి.. హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ చీఫ్ యహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ సైన్యం హత మార్చినట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ బందీలను వదిలి పెడితే రేపే యుద్ధం ముగిస్తామని చెప్పుకొచ్చారు. గాజా పౌరులను ఉద్దేశిస్తూ నెతన్యాహు కీలక కామెంట్స్ చేశారు. హమాస్ తమ ఆయుధాలను వదిలేసి.. మా బందీలను తిరిగి పంపించాలని కోరారు.

Read Also: WCL 2024: వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్‌లో 902 అప్రెంటిస్ పోస్టుల భర్తీ

ఇక, అదే విధంగా తమ పౌరులను వదిలిన హమాస్ తీవ్రవాదులకు బయటకు వచ్చి జీవించే అవకాశం కల్పిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హామీ ఇచ్చారు. లేదంటే వేటాడి మరీ ఒక్కోక్కరిని హతమరుస్తామని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. వేలాది మంది ఇజ్రాయెల్ పౌరులను హతమర్చిన హంతకుడు చనిపోయాడు.. ఇది అతి పెద్ద విజయంగా నేను భావిస్తున్నాను.. ఇది గాజాతో యుద్ధం ముగింపు కాదు.. ఇప్పుడే ముగింపు దశ ప్రారంభమైంది.. అలాగే, ఇరాన్ పాలన యొక్క ఉగ్రవాద పాలన కూడా ముగుస్తుందని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు.

Read Also: Dwaraka Tirumala: కన్నుల పండుగగా చిన వెంకన్న కళ్యాణ మహోత్సవం..

హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ అధినేత సిన్వర్ మృతిపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ రియాక్ట్ అయ్యారు. సిన్వర్ మరణంతో తగిన న్యాయం జరిగిందన్నారు. అలాగే, ఇది గాజాతో యుద్ధానికి ముగింపు పలికేందుకు మంచి అవకాశంగా భావిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ సురక్షితంగా ఉంది.. బందీలు విడుదలవడంతో పాటు గాజాలో అన్ని బాధలు తొలగిపోతాయని ఆమె వెల్లడించారు.