ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో సోమవారం జరిగిన పేలుడులో కనీసం ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని అక్కడి స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. పశ్చిమ కాబూల్‌లోని పోలీస్ డిస్ట్రిక్ట్ 5లో సోమవారం ఉదయం ఈ పేలుడు సంభవించిందని తెలిపాయి. ఈ పేలుడుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన దుకాణదారుడు అహ్మద్ ముర్తాజా వార్తా సంస్థ రాయిటర్స్‌తో మాట్లాడుతూ, తాను కస్టమర్‌తో బిజీగా ఉన్నానని, “తన స్టోర్‌ను కదిలించిందని చెప్పాడు”. పేలుడు జరిగిన ప్రదేశం నుండి ప్రజలు బాధితులను తీసుకెళ్తున్నట్లు నేను చూశాను, వారు చనిపో యారో లేదా గాయపడ్డారో నాకు తెలియదు” అని ముర్తజా రాయిటర్స్ కు తెలిపారు. పశ్చిమ కాబూల్‌లోని షియాలు అధికంగా ఉండే ప్రాం తంలో ఒక మినీబస్సును అయస్కాంత బాంబు ధ్వంసం చేసిన రెండు రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది. ఇస్లామిక్ స్టేట్ క్లెయిమ్ చేసిన ఈ దాడిలో చాలా మంది మరణించారు.
ఆప్ఘానిస్తాన్‌ను తాలిబాన్‌లు చేజిక్కించుకున్న తర్వాత బాంబు పేలుళ్లు ఎక్కువయ్యయి. కాబుల్ విమానశ్రయంపై ఇటీవల జరిగిన జంట ఆత్మాహుతి దాడుల్లో 108మంది మరణించారు. ఇందులో 13 మంది అమెరికా సైనికులుకాగా, 95 మంది ఆప్ఘాన్ వాసులు. 150 మంది గాయపడ్డారు.ఈ దాడికి ఐఎస్‌ఐఎస్-ఖోర్సా బాధ్యత వహిం చింది. మృతుల్లో తమ వారు కూడా ఉన్నట్లు తాలిబాన్‌లు ప్రకటిం చారు. తాలిబాన్లు ఒక్కప్పటి హింసాకాండకు, నియంత చర్యలకు పాల్పడమని చెప్పినప్పటికి మహిళపై అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. జర్నలిస్ట్‌లపై కూడా దాడులు పెరిగిపోయాయి.తమకు వ్యతిరేకంగా పనిచేసే జర్నలిస్టులను బహిరంగంగానే కాల్చి చంపారు. పైకి మాత్రం అంతా సవ్యంగా ఉంటుందంటూ, సరిహద్దు దేశాలతో మంచి సంబంధాలు కోరుకుంటున్నామని తాలిబాన్‌లు చెబుతున్నారు.
