NTV Telugu Site icon

Iran-US: ముసురుతున్న యుద్ధ వాతావరణం.. అవసరమైతే అణ్వాయుధాలు ప్రయోగిస్తామన్న ఇరాన్

Usiran

Usiran

ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం ముసురుతోంది. తమతో అణు ఒప్పందం చేసుకోకపోతే భయంకరమైన బాంబు దాడులు జరుగుతాయని ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. తామేమీ తక్కువ కాదంటూ ఇరాన్‌ కూడా అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. దాడులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించింది. ఇలా రెండు దేశాల మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ఏదొక సమయంలో అమెరికా దాడి చేయొచ్చని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఇది కూడా చదవండి: Bajinder Singh: అత్యాచారం కేసులో పాస్టర్ బజీందర్ సింగ్ కు జీవిత ఖైదు

ఈ నేసథ్యంలో తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారుడు అలీ లారిజానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే తాము అణ్వాయుధాలకు వెళ్లాల్సి వస్తుందని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అణ్వాయుధాల వైపు వెళ్లాలనుకోవడం లేదుగానీ.. ఇరాన్ విషయంలో తప్పు జరిగితే మాత్రం అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించక తప్పదని హెచ్చరించారు. ఇంతకు మించిన వేరే మార్గం లేదని తేల్చి చెప్పారు.

ఇది కూడా చదవండి: Chamala Kiran Kumar Reddy: 19 ఏళ్లుగా భూమి వివాదంలో ఉంది.. కాబట్టి అక్కడ చెట్లు పెరిగాయ్!

వాషింగ్టన్‌తో ఇరాన్ అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ లేఖ రాశారు. అందుకు ఇరాన్ ససేమిరా అంది. తాము ప్రత్యక్ష చర్చలకు అంగీకరించబోమని.. పరోక్ష చర్చలకైతే ఓకేనని ఇరాన్ తెలిపింది. ఈ వ్యాఖ్యలు ట్రంప్‌నకు కోపం తెప్పించాయి. తమతో నేరుగా అణు ఒప్పందం చేసుకోకపోతే భీకర దాడులు ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదే రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణానికి కారణమైంది.

ఇది కూడా చదవండి: TTD : ఏప్రిల్ 5 నుంచి రామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు