Site icon NTV Telugu

Pakistan PM Shehbaz Sharif: పాకిస్తాన్‌కు ఉగ్రవాదమే ప్రధాన సమస్య

Pakistan

Pakistan

Terrorism Is Pakistan’s Foremost Problem: దాయాది దేశం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగదోసే దేశంగా ఉంది. ప్రపంచంలోని పలు ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ కేంద్రం. భారతదేశంపై ఎప్పటికప్పుడు సీమాంతర తీవ్రవాదాన్ని ఎగదోస్తూ ఉంటుంది. పాకిస్తాన్ ఎప్పుడూ కూడా తమదేశం ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం లేదని బుకాయిస్తూనే ఉంటుంది. అయితే తమ వరకు వస్తే కానీ నొప్పి తెలియదన్నట్లు.. తాజాగా పాకిస్తాన్ లో లక్కీమార్వాట్ లో పోలీస్ వ్యాన్ పై ఉగ్రదాడి జరిగింది. అయితే దీన్ని ఖండించారు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.

Read Also: Amazon Layoffs: ఉద్యోగులకు అమెజాన్ షాక్.. 10వేలమందికి ఊస్టింగ్

ఉగ్రవాదం పాకిస్తాన్ ప్రధాన సమస్యల్లో ఉగ్రవాదం ఒకటిగా కొనసాగుతుందని ఆయన అన్నారు. ఉగ్రవాదం పాకిస్తాన్ సైనికులకు, పోలీసులకు శాపంగా మారాయి అని అన్నారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని లక్కీ మార్వట్ లో బుధరవాం ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు పోలీస్ వ్యాన్ పై విచక్షణారితంగా కాల్పులు జరిపారు. పాకిస్తాన్ వాయువ్య ప్రాంతంలో ఇటీవల దాడులు ఎక్కువ అయ్యాయి. కొన్నేళ్లుగా ఈ ప్రాంతం హింసకు మారుపేరుగా ఉంది.

ఖైబర్ పఖ్తుంఖ్వాలోని స్వాత్‌ లోయలో తెహ్రిక్-ఇ-తాలిబాన్ ఉగ్రసంస్థ చాలా బలంగా ఉంది. 2000 దశకం నుంచి ఈ ప్రాంతంలో ఉగ్రదాడులకు కారణం అవుతోంది. అక్కడి గిరిజన ప్రాంతాల్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి సమాంతరంగా టీటీపీ ఉగ్రవాదం సంస్థ పాలన నిర్వహిస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే అక్కడ పాక్ రాజ్యాంగం అనేది ఉండదు. ఉగ్రవాదులు చెప్పేదే రాజ్యాంగం, చేసేదే చట్టంగా ఉంటుంది.

Exit mobile version