NTV Telugu Site icon

Maegan Hall: ఉద్యోగం కోల్పోయిన ఆ పోలీస్ ఆఫీసర్‌కి స్ట్రిప్ క్లబ్ బంపరాఫర్

Maegon Hall Offer

Maegon Hall Offer

Tennessee Cop Maegan Hall Gets 10 Thousand Dollars Offer From Strip Club: మేగన్ హాల్.. ఈ నెల ప్రారంభంలో ఈమె ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కారణం.. ఆరుగురు తోటి అధికారులతో మేగన్ ఎఫైర్ నడిపింది. తనకు పెళ్లి అయినప్పటికీ.. తన కామవాంఛ తీర్చుకోవడంతో కోసం తన కొలీగ్స్‌తో శృంగార కార్యకలాపాలు కొనసాగించింది. ఎప్పుడుపడితే అప్పుడు వైల్డ్ పార్టీలు కూడా చేసుకున్నారు. ఫోన్ నిండా బూతు మెసేజ్‌లే. చివరికి వీరి బండారం బట్టబయలు కావడంతో.. పోలీస్ డిపార్ట్‌మెంట్ వీరిని సస్పెండ్ చేసింది. ఈ దెబ్బకు ఆమె పరువు బజారున పడింది, అప్రతిష్టపాలు అయ్యింది.

Pawan Kalyan: అన్ స్టాపబుల్.. ఫైనల్ గా పవన్ ఎపిసోడ్ వచ్చేది ఎప్పుడంటే.?

ఈ నేపథ్యంలోనే తాజాగా నాష్‌విల్లేలోని డేజావు అనే స్ట్రిప్ క్లబ్ మేగన్ హాల్‌కు బంపరాఫర్ ఇచ్చింది. తమ క్లబ్‌లో పెర్ఫామ్ చేస్తే.. 10వేల డాలర్లు ఇస్తామని ఆ క్లబ్ ప్రకటించింది. ప్రస్తుతం ఆమెకు ఉన్న ఆర్థిక సమస్యల దృష్ట్యా.. ఇది నిజంగా చాలా గొప్ప ఆఫర్ అని ఆ క్లబ్‌లో పని చేసే షో గర్ల్స్ పేర్కొన్నారు. రీజనల్ డైరెక్టర్ మైకెల్ దుర్హమ్ మాట్లాడుతూ.. మార్చి 17వ తేదీన మా క్లబ్‌లో రెండు షోస్ ఉన్నాయి. ఈ షోల్లో మేగన్ పెర్ఫామ్ చేస్తే.. షోకి 5వేల డాలర్లు చొప్పున మొత్తం 10వేల డాలర్లు ఇస్తామని తెలిపారు. ఇప్పుడు ఆమె పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో లేదు కాబట్టి, తన ఆర్థిక అవసరాల దృష్ట్యా ఆమె కెరీర్ పరంగా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చన్నారు.

Nandamuri Taraka Ratna: నిలకడగా తారకరత్న ఆరోగ్యం.. స్టెంట్‌ వేసిన వైద్యులు

కాగా.. లా వెర్గ్నే పోలీస్ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన అంతర్గత విచారణలో మేగన్ హాల్ తన తోటి అధికారులతో శృంగార కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు తేలింది. దీంతో.. వెంటనే అందరినీ సస్పెండ్ చేసేశారు. ఈ విషయంపై పోలీసు చీఫ్ బర్రెల్ డేవిస్ మాట్లాడుతూ.. ఇది తమ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి, నగరానికి ఎంతో క్లిష్టమైన పరిస్థితి అని తెలిపారు. అయితే కొంతమంది చర్యలు ఈ విభాగం మొత్తం ప్రాతినిధ్యం వహించదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు.. తన భార్య ఇలాంటి పాడు పని చేసినప్పటికీ, మేగన్ హాల్ భర్త జెడిడియా హాల్ ఆమెనే అంటిపెట్టుకొని ఉన్నాడు. విడాకులు ఇవ్వలేదు.

Street Dog: వీధికుక్క బీభత్సం.. ఒక్కరోజే 80 మందిని కరిచింది..

Show comments