రోడ్డు ప్రమాదాలు జరగడం సహజం. కొన్ని తెలిసి జరుగుతుంటాయి. ఇంకొన్ని అనుకోని విధంగా జరుగుతుంటాయి. అయితే అప్పుడప్పుడు కొన్ని పరిస్థితుల్లో స్కిడ్ అయి బండ్లు పడిపోతుంటాయి. కానీ ఒకే చోట ప్రమాదాలు జరుగుతుంటే మాత్రం అది వాహనదారుల తప్పు కాదు. కచ్చితంగా రహదారిపైనే అనుమానం వ్యక్తం చేయాలి. రోడ్డు నిర్మాణంలోనే ఏదో లోపం ఉన్నట్లు గుర్తించాలి. ఇలాంటి ఘటనే పూణెలో చోటుచేసుకుంది. 3 గంటల వ్యవధిలో ఒకే చోట 10 ప్రమాదాలు జరిగాయి. బైక్‌లు రావడం పడిపోవడం.. ఇలా గాయాలతో వాహనదారులు బయల్దేరి వెళ్లడం కనిపించాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రత్యేక కథనం! ఏం తేల్చిందంటే..!
పూణెలోని దేహు-యెలవాడి రోడ్డులో మూడు గంటల్లో పది ప్రమాదాలు జరిగాయి. సమీపంలో సీసీ కెమెరాలో ఈ ప్రమాదాలు రికార్డయ్యాయి. అధికారులు రోడ్డు మరమ్మత్తు పనులు చేస్తున్నారు. ఇంకోవైపు వర్షాలు కురుస్తు్న్నాయి. దీంతో రోడ్డు బురదమయం అయింది. దీంతో వాహనదారులు నెమ్మదిగా వెళ్తున్న స్కిడ్ అయి పడిపోతున్నారు. ఇలా ఒకేచోట పది ప్రమాదాలు జరిగాయి.
ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్‌లో ఘోరం.. గుండెపోటుతో 4వ తరగతి విద్యార్థి మృతి
అయితే ప్రమాదాలపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకుని నాథుడే లేదు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. తక్షణమే రోడ్డు మరమ్మత్తులు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదాల్లో ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. కానీ గాయాల పాలయ్యారు. బైక్‌లు కింద పడిపోవడంతో గాయాలతో తిరిగి లేచి వెళ్లిపోయారు. అయితే తాత్కాలిక మరమ్మతులైన చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలోనే రోడ్లన్నీ ఇలానే ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు.
