Supreme Court: ఐన్‌స్టీన్ E = mc²ని సవాల్ చేస్తూ పిల్.. సుప్రీంకోర్టు రియాక్షన్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: దశాబ్ధాల కింద ప్రకటించిన ఐన్‌స్టీన్, డార్విన్ సిద్ధాంతాలు ఇప్పటికి శాస్త్రరంగంలో కీలకంగా ఉన్నాయి. ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం E = mc² ఇందులో ప్రధానమైనది. ఇప్పటికీ ఫిజిక్స్‌లో ఈ సిద్ధాంతం కీలకంగా ఉంది. మరోవైపు డార్విన్ మనిషి పరిణామ సిద్ధాంతం కూడా ఇదే కోవలోకి వస్తుంది.
ఇదిలా ఉంటే ఈ రెండు సిద్ధాంతాలను సవాల్ చేస్తూ ఓ వ్యక్తి ఏకంగా సుప్రీంకోర్టులోని ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్)ని దాఖలు చేశాడు. సుప్రీంకోర్టు ఈ పిల్ ని కొట్టేసింది. ఈ సిద్ధాంతాలు తప్పుగా ఉన్నాయని భావిస్తే మేం ఏం చేయలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్ రాజ్ కుమార్, తాను ఈ సిద్ధాంతాలను తప్పుగా నిరూపించాలని అనుకుంటున్నానని, తన వాదనలను వినిపించేందుకు ఓ వేదిక కావాలని కోరాడు.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
Read Also: Supreme Court: 89 ఏళ్ల వ్యక్తికి భార్య నుంచి విడాకులు తిరస్కరించిన కోర్టు..
తాను స్కూల్, కాలేజీలో చదివిందంతా తప్పే అని పిటిషనర్ కోర్టుకు చెప్పాడు. ఈ సిద్దాంతంపై పనిచేయాలని కోర్టు అతనికి సూచించింది. ఆర్టికల్ 32 ప్రకారం పిటిషనర్ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించిందన్న అతని వాదనను కోర్టు ప్రశ్నించింది. ‘‘ నువ్వు ఈ సిద్ధాంతాన్ని ఇంప్రూవ్ చేసుకుంటావు, దీనికి సుప్రీంకోర్టు ఏం చేయాలి..? నువ్వు సైన్స్ స్టూడెంట్ అని చెబుతున్నావు, ఇప్పుడు ఆ థియరీ తప్పని అంటున్నావు.. ఈ థియరీ తప్పని నమ్మితే, అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఏమీ చేయాల్సిన పనిలేదు. ఆర్ఠికల్ 32 ప్రకారం మీ ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించడం ఏమిటి..? ’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
డార్విన్ సిద్ధాంతాన్ని నమ్మి చాలా మంది మరణించారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అయితే కోర్టు నీ సొంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించని కోరింది. చాలా కాలంగా ఉన్న రెండు సిద్ధాంతాలు తప్పు అని మీరు భావిస్తే, మీ సొంత సిద్ధాంతాన్ని ప్రచారం చేయండి అని జస్టిస్ కౌల్ అన్నారు.
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!