Citroen Basalt: కూపే స్టైల్ డిజైన్‌తో టాటా కర్వ్ రాబోతోంది. ఆగస్టు 7న ఇండియన్ మార్కెట్‌లోకి ఈ కార్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇదిలా ఉంటే కర్వ్‌కి ప్రత్యర్థిగా ఫ్రెంచ్ కార్ మేకర్ సిట్రోయన్ బసాల్ట్ కారును మార్కెట్‌లోకి దింపుతోంది. ఆగస్టు 02న ఈ కారు ఆవిష్కరించబడుతోంది. కర్వ్, బసాల్ట్ రెండు ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా , టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, స్కోడా కుషక్, వోక్స్‌వాగన్ టైగున్‌కి పోటీగా ఉండబోతున్నారు.
Read Also: Mahindra Thar Roxx : భారత మార్కెట్లోకి 5 డోర్స్ మహీంద్రా థార్.. తేదీ విడుదల..
బసాల్ట్ ఎస్‌యూవీ భారతదేశంలో సిట్రోయన్ విడుదల చేయబోయే 5వ కారు. దీనికి ముందు C3 హ్యాచ్‌బ్యాక్, eC3 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్, C3 ఎయిర్‌క్రాస్ SUV మరియు C5 ఎయిర్‌క్రాస్ SUVలను కలిగి ఉంది. ప్రస్తుతం రాబోతున్న బసాల్ట్ కూడా టాటా కర్వ్ మాదిరిగానే కూపే స్టైల్‌లో ఉండబోతోంది. తమిళనాడు తిరువళ్లూర్ లోని సిట్రోయన్ ప్లాంట్‌లో ఆ కారు స్థానికంగా ఉత్పత్తి చేయబడుతోంది. మనదేశంలో చూసుకుంటే కూపే డిజైన్ కార్లు చాలా తక్కువగా ఉన్నాయి.
ప్రస్తుతం రాబోతున్న బసాల్ట్‌లో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, అప్‌గ్రేడ్ చేసిన టెయిల్‌ల్యాంప్‌లు,కొత్త అల్లాయ్ వీల్ డిజైన్‌లతో వస్తుంది. ఇంటీరియర్‌లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఫ్రంట్-వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఉంటాయి. ఇది 1.2 లీటర్ జనరేషన్-3 టర్బో ప్యూర్ టెక్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ప్రస్తుతం దీనిని సీ3 ఎయిర్‌క్రాస్ కార్లలో వాడుతున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 110PS పవర్,190Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ఉన్నాయి. దీని ధర రూ. రూ. 10 లక్షల నుండి రూ. 16 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. ప్రస్తుత త్రైమాసికంలోనే ఈ కారు విడుదలయ్యే అవకాశం ఉంది.