NTV Telugu Site icon

US: ఒరెగాన్ ఫారెస్ట్‌లో కూలిన ట్యాంకర్ విమానం.. పైలట్ మృతి

Us

Us

అమెరికాలోకి ఒరెగాన్ అటవి ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. శుక్రవారం మంటలు అంటుకుని వేగంగా వ్యాపించాయి. దీంతో రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఇక చిన్న ఎయిర్ ట్యాంకర్‌తో మంటలను అదుపు చేస్తుండగా దారి తప్పి కూలిపోయింది. దీంతో ఈ ప్రమాదంలో పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. గ్రాంట్ కౌంటీ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ సింగిల్ ఇంజిన్ ఎయిర్ ట్యాంకర్‌ను గుర్తించింది. సెనెకా-మల్హూర్ నేషనల్ ఫారెస్ట్ సమీపంలో 567 చదరపు కిలోమీటర్ల దూరంలో ఫాల్స్ ఫైర్‌తో పోరాడుతుండగా ఈ విమానం అదృశ్యమైంది. విమానంలో పైలట్ తప్ప ఇంకెవరు లేదని ల్యాండ్ మేనేజ్‌మెంట్ బ్యూరో ధృవీకరించింది.

ఇది కూడా చదవండి: Cancers In India: భారత్‌లో పెరుగుతున్న “హెడ్ అండ్ నెక్” క్యాన్సర్లు.. 26 శాతం కేసులు..

ఇదిలా ఉంటే మంటలు విస్తరించడంతో జనావాసాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఇక ఆరిగన్, ఐదహోలలో మంటలు ఎగిసిపడడంతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. ఇక కాలిఫోర్నియాలోని బ్యూట్, తెహమా కౌంటీలలో అగ్నిమాపక సిబ్బంది కార్చిచ్చును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూనే జనావాసాలను ఖాళీ చేయిస్తున్నారు. అలాగే కెనడాలోనూ కొన్ని ప్రాంతాల్లో కార్చిచ్చు ప్రభావం కనిపించింది. దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. చాలా మంది ప్రాణభయంతో ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోతున్నారు.

ఇది కూడా చదవండి: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు చిన్నారులు సహా 8 మంది మృతి