Site icon NTV Telugu

Sydney Attack: సిడ్నీ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకరి వద్ద భారత పాస్‌పోర్ట్..

Terrorists

Terrorists

Sydney Attack: ఆస్ట్రేలియా బోండీ బీచ్ మారణహోమంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇద్దరు ఉగ్రవాదులు యూదులను లక్ష్యంగా చేసుకుని తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 15 మంది చనిపోయారు. ఉగ్రవాదుల్ని సాజిద్ అక్రమ్(50), ఇతని కుమారుడు నవీద్ అక్రమ్(24)లుగా గుర్తించారు. అయితే, నిందితుల్లో సాజిద్ అక్రమ్ గతంలో భారతీ పాస్‌పోర్ట్ ఉపయోగించినట్లు తెలిసింది. దాడికి ముందు వీరిద్దరు గత నెలలో ఫిలిప్పీన్స్‌కు వెళ్లి వచ్చారు. అక్కడే తీవ్రవాద ఇస్లామక్ బోధకులనున కలుసుకుని, సైనిక తరహా శిక్షణ పొందారా? అని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

Read Also: Realme Narzo 90: 7000mAh బ్యాటరీలతో రియల్‌మీ Narzo 90x, Narzo 90 ఫోన్‌లు విడుదల.. ఫస్ట్ సేల్ లో చౌక ధరకే

నివేదిక ప్రకారం, సాజిద్ అక్రమ్ గత నెలలో ఆస్ట్రేలియా నుంచి ఫిలిప్పీన్స్ భారతీయ పాస్‌పోర్టు ఉపయోగించి ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఇతడి కొడుకు ఆస్ట్రేలియన్ పాస్‌పోర్ట్ ఉపయోగించాడని రాయిటర్స్ నివేదించింది. నిందితులు ఇద్దరూ కూడా పాకిస్తాన్‌కు చెందిన వారని తేలినప్పటికీ, వీరిలో ఒకరి వద్ద భారత పాస్‌పోర్టు ఎలా ఉందనేది ఇప్పుడు కీలకంగా మారింది. నవీద్, సాజిద్‌లు ఇద్దరూ కూడా ఫిలిప్పీన్స్ వెళ్లి ఉగ్రవాద శిక్షణ పొందినట్లు అధికారులు చెబుతున్నారు.

ఫిలిప్పీన్స్‌లో, ముఖ్యంగా దక్షిణ భాగంలో తీవ్రవాద మతాధికారులు, ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులకు కేంద్రంగా ఉంది. అక్కడ ఉన్న సాయుధ ఇస్లామిక్ సంస్థలు ఐఎస్‌కు విధేయతను ప్రకటించుకున్నాయి. ఇద్దరు వ్యక్తులకు అంతర్జాతీయ జిహాదీ నెట్వర్క్ తో సంబంధం ఉందా.? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఆస్ట్రేలియాలో జన్మించిన నవీద్‌కు 2019లో అనుమానిత ఐఎస్ ఉగ్రవాదంతో సంబంధాలు ఉన్నట్లు ఆస్ట్రేలియా భద్రతా సంస్థల పరిశీలనలోకి వెళ్లాడు, కానీ ఆ తర్వాత ఇతడిపై అధికారుల నిఘా తగ్గింది. ఇస్లామిక్ స్టేట్ భావజాలం కలిగిన ఇద్దరూ కూడా హనుక్కా వేడుకల్ని జరుపుకుంటున్న యూదులను లక్ష్యంగా చేసుకుని చంపారు.

Exit mobile version