NTV Telugu Site icon

Pakistan: పాకిస్తాన్ పరువు పాయె.. ఎంబసీని మూసేసిన స్వీడన్..

Pakistan

Pakistan

Pakistan: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ పరిస్థితి నానాటికి దిగజారుతోంది. అక్కడ నెలకొన్న అస్థిర పరిస్థితులు ఇతర దేశాలను కూడా భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ దేశంలో స్వీడన్ తన రాయబార కార్యాలయాన్ని నిరవధికంగా మూసేసింది. వీసాలు, ఇతర దౌత్యసంబంధాలను మూసేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ ప్రభుత్వం భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినా కూడా ఇతర దేశాలు నమ్మడం లేదు. ప్రభుత్వం, సుప్రీంకోర్టుకు మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులే ఇందుకు కారణం కావచ్చని తెలుస్తోంది.

Read Also: GT vs PBKS: పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం

ఇస్లామాబాద్‌లోని ప్రస్తుత భద్రతా పరిస్థితుల కారణంగా, స్వీడన్ రాయబార కార్యాలయం సందర్శకుల కోసం మూసివేయబడింది. మైగ్రేషన్ విభాగం ప్రస్తుతం ఎలాంటి అభ్యర్థనలను నిర్వహించదు అని రాయబార కార్యాలయం వెబ్‌సైట్‌లో ఒక నోటీసులో పేర్కొంది. రాయబార కార్యాలయం ఎప్పడు పున:ప్రారంభిస్తామనే విషయాలను ప్రస్తుతం చెప్పలేమని నోటీసులో పేర్కొంది. ఇదిలా ఉంటే ఇది స్వీడన్ లో ఇటీవల జరిగిన ఖురాన్ ను తగులపెట్టిన ఘటనతో ఈ మూసివేతకు సంబంధం ఉన్నట్లు సమాచారం. జనవరి 21న ఓ స్వీడన్ వ్యక్తి స్టాక్‌హోమ్‌లోని టర్కిష్ రాయబార కార్యాలయం ముందు ఖురాన్ కాపీని తగులబెట్టాడు, ప్రపంచవ్యాప్తంగా ముస్లింల నుండి ఖండించారు.

దీన్ని పాకిస్తాన్ పీఎం షహబాజ్ షరీఫ్ తో పాటు మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. పవిత్ర ఖురాన్ ను తగలబెట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1.5 బిలియన్ ముస్లింల మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీశారని ట్వీట్ చేశారు. ఈ నేేపథ్యంలో స్వీడన్ తన మిషన్ ను పాకిస్తాన్ మూసేశారనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం చైనా తన పౌరులకు కూడా భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ భద్రతతో పాటు ప్రైవేట్ భద్రతను కల్పించుకోవాలని సూచించింది.

Show comments