NTV Telugu Site icon

Solar Maximum: “సోలార్ మాగ్జిమమ్”.. సూర్యుడిపై భారీ విస్పోటనాలు.. భూమికి ప్రమాదమా..?

Solar Maximum

Solar Maximum

Solar Maximum: సూర్యుడు ఊహించిన దానికన్నా ముందు ‘‘సోలార్ మాగ్జిమమ్’’ దశకు చేరుకుంటున్నాడని శాస్త్రవేత్తులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో సూర్యుడిపై భారీగా మరిన్ని విస్పోటనాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిక చేస్తున్నారు. ఏప్రిల్ నెలలోనే 23 కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఏర్పడ్డాయి. ఇవి భూమిని చేరుకుని ‘భూ అయస్కాంత తుఫాను’లకు కారణం అయ్యాయి. గత నెలలో సూర్యుడిపై మూడు భారీ విస్పోటనాలు సంభవించాయి.

సోలార్ మాగ్జిమమ్ వల్ల సూర్యుడిపై చర్యలు వేగం అయ్యాయి. దీంతో రానున్న కాలంలో ప్రమాదకరమైన విస్పోటనాలు సంభవించవచ్చు. శాస్త్రవేత్తలు సూర్యుడి ఉపరితలంపై 96 సన్ స్పాట్స్ గుర్తించారు. సూర్యుడిపై నల్లగా ఉండే ప్రాంతాలను సన్ స్పాట్స్ గా పిలుస్తారు. ఈ ప్రాంతాల్లో మాగ్నిటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.

Read Also: Chopper Crash: కాశ్మీర్‌లో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్..

25వ సోలార్ సైకిల్ లోకి సూర్యుడు..

ప్రస్తుత సూర్యుడు ప్రతీ 11 ఏళ్లకు ఓ సౌర చక్రాన్ని పూర్తిచేస్తాడు. సూర్యుడు ప్రస్తుతం 2019లో ప్రారంభమైన 25వ సౌర చక్రంలో ఉన్నాడు ఈ సమయంలో సూర్యుడి ఉపరితలంపై విపరీతమైన చర్యలు జరుగుతుంటాయి. ఈ సమయంలో సూర్యుడిపై భారీగా పేలుళ్లు, సౌరజ్వాలలు ఏర్పడుతుంటాయి. ఈ పేలుళ్ల కారణంగా ఆవేశిత కణాలను విశ్వంలోని నలువైపు ఆవేశిత కణాలు ప్రయాణిస్తుంటాయి. ప్రతీ 11 ఏళ్లకు సూర్యుడి ధృవాలు తారుమారు అవుతుంటాయి. అంటే దక్షిణ ధృవం ఉత్తరంగా, ఉత్తర ధృవం దక్షిణంగా మారుతుంటుంది. ఈ సౌర చక్రంలో సోలార్ మినిమం, సోలార్ మ్యాగ్జిమమ్ అనే దశలు ఉంటాయి. సోలార్ మాగ్జిమమ్ దశలో పెద్ద ఎత్తున కరోనల్ మాస్ ఎజెక్షన్స్ జరుగుతుంటాయి. ఇవి భూమి పరిమాణంతో పోలిస్తే కొన్ని వందల రెట్ల పెద్దవిగా వ్యాపిస్తూ ఉంటాయి.

Read Also: Celestial event: గ్రహాన్ని కబళిస్తున్న నక్షత్రాన్ని గుర్తించిన సైంటిస్టులు.. ఏదో రోజు భూమికి కూడా ఇదే పరిస్థితి..

భూమికి ప్రమాదమా..?

కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ద్వారా ఆవేశిత కణాలు భూమి వైపు వస్తుంటాయి. ఇవి ‘‘జియోమాగ్నెటిక్ తుఫాన్ల’’కు కారణం అవుతుంటాయి. అయితే వీటి వల్ల భూమిపై ఉన్న ప్రజలకు ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే జీపీఎస్ వ్యవస్థ, శాటిలైట్స్, పవర్ గ్రిడ్స్ పై ప్రభావం ఉండే అవకాశం ఉంది. భూమికి ఉన్న అయస్కాంత క్షేత్రం, సూర్యుడు నుంచి వచ్చే రేడియేషన్, ఆవేశిత కణాలను అడ్డుకుని భూమిని రక్షిస్తుంది. వీటి వల్ల ధృవాల వద్ద ఆరోరాలు ఏర్పడుతాయి.