NTV Telugu Site icon

Pakistan: పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి.. 10 మంది సైనికులు మృతి

Pak

Pak

Pakistan: దాయాది దేశం పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. బన్నూలోని చెక్ పాయింట్ దగ్గర ఉన్న ఓ కారును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చి వేశాడు. కారును పేల్చిన తర్వాత అతని సహచరులు కాల్పులకు దిగినట్లు అక్కడి మీడియా తెలిపింది. ఈ ఘటనలో సుమారు మంది సైనికులు మృతి చెందినట్లు సమాచారం. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. వారికి చికిత్స అందిస్తున్నామని ఓ అధికారి పేర్కొన్నారు.

Read Also: Mollywood : మెగాస్టార్ – కంప్లిట్ స్టార్ భారీ మల్టీ స్టార్ట్.

అయితే, ఈ దాడికి తామే బాధ్యులమని హఫీజ్ గుల్ బహదూర్ సాయుధ బృందం ప్రకటించింది. అలాగే, పాకిస్తానీ తాలిబాన్ అని కూడా పిలువబడే తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఆ దాడికి పాల్పడింది తామే అని పేర్కొనింది. ఇది తమ సభ్యులలో ఒకరిని లక్ష్యంగా చేసుకుని భద్రతా దళాలు జరిపిన వెతకడంతోనే ప్రతిస్పందనగా ఈ దాడి చేసినట్లు పేర్కొంది. ఇక, 2021లో ఆఫ్ఘన్ తాలిబాన్ కాబూల్‌లో అధికారాన్ని తిరిగి పొందింది.. అప్పటి నుంచి పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలు హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి.

Show comments