NTV Telugu Site icon

Anti-Hindu hate: బ్రిటన్ లో పెరుగుతున్న హిందూ వ్యతిరేకత.. మతం మారాలని ఒత్తిడి..

Anti Hindu In Uk

Anti Hindu In Uk

Anti-Hindu hate: బ్రిటన్ వ్యాప్తంగా హిందూ వ్యతిరేకత పెరుగుతోందని ఓ నివేదిక పేర్కొంది. బ్రిటన్ పాఠశాలల్లో హిందూ విద్యార్థులు వివక్ష ఎదుర్కొంటున్నట్లు నివేదిక వెల్లడించింది. బ్రిటన్‌లోని పాఠశాలల్లో హిందూ విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్ష మరియు బెదిరింపుల గురంచి లండన్ కు చెందిన హేడ్రీ జాక్సన్ సొసైటీ సర్వే నిర్వహించింది. నివేదిక 988 మంది హిందూ తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించింది. వీరిలో 51 శాతం మంది తమ పిల్లలు స్కూల్లలో హిందూ వ్యతిరేక ద్వేషాన్ని, వివక్షను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

Read Also: Madhya Pradesh : దారుణం.. పిల్లాడిని చంపి కూలర్లో కుక్కారు

తల్లిదండ్రల్లో 19 శాతం మంది పాఠశాలలు హిందూ వివక్షను గర్తించగలవని తెలిపారు. కేవలంలో 1 శాతం కన్నా తక్కువ పాఠశాలలు గత 5 ఏళ్లలో ఈ ద్వేషపూరిత సంఘటనలు నివేదించినట్లు నివేదిక తెలిపింది. తల్లిదండ్రుల్లో కొంత మంది తన పిల్లలకు ఎదురైన చేదు అనుభవాలను కూడా ప్రస్తావించారు. తన కూతురు స్కూల్లో బెదిరింపుకు గురైందని, హిందూ వ్యతిరేక దూషణలతో పాటు తనపై గొడ్డు మాంసాన్ని విసిరేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు. మరో పేరెంట్ మాట్లాడుతూ.. ‘‘నా బిడ్డ నుదిటిపై బొట్టులో పాఠశాలకు వెళ్లాడు. చివరకు అతను పాఠశాలకు వెళ్లకూడదనుకే స్థాయిలో’’ బెదిరింపులకు గురయ్యారని తెలిపారు. ఇప్పటి వరకు తన తూర్పు లండన్ లో అతడి పాఠశాలను మూడుసార్లు మార్చాల్సి వచ్చిందని అన్నారు.

హిందూ వ్యతిరేక దూషనలే కాకుండా, పిల్లలు జోనోఫోబిక్, జాత్యాహంకార దూషణలను ఎదుర్కొన్నారు. హిందూ మతానికి చెందిన పిల్లలను కొంతమంది ముఠాగా ఏర్పడి బెదిరించేవారనే విషయం బయటకు వచ్చింది. ప్రత్యేకంగా భారతదేశంలో పీఎం నరేంద్రమోదీ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత చాలా మంది పిల్లలు తోటి విద్యార్థుల నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నట్లు తేలింది. వారిని ‘‘ఖాఫిర్, అవిశ్వాసకులు’’ విమర్శించేవారని, మతం మారాలని, లేదా నరకానికి వెళ్లాలని అనేవారని నివేదిక పేర్కొంది. మీరు స్వర్గానికి వెళ్లాలంటే మీరు ఇస్లాంలోకి మారాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు.