Site icon NTV Telugu

Canada: కెనడాలో విమాన ప్రమాదం.. కేరళకు చెందిన పైలట్ మృతి

Canada

Canada

కెనడాలో రెండు శిక్షణా విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మృతుల్లో కేరళకు చెందిన విద్యార్థి పైలట్ శ్రీహరి సుకేష్(21) కాగా.. అతని క్లాస్‌మేట్ కెనడియన్ పౌరుడు సవన్నామే రోయెస్(20)గా గుర్తించారు.

ఇది కూడా చదవండి: Compact vs Slim Phones: కాంపాక్ట్, స్లిమ్ ఫోన్లు.. ఏది బెస్ట్? ఎందుకు..?

మంగళవారం కెనడాలో జరిగిన రెండు శిక్షణ విమానాల ప్రమాదంలో మరణించిన ఇద్దరు వ్యక్తుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థి పైలట్ కూడా ఉన్నారని టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ బుధవారం తెలిపారు. కెనడాలోని దక్షిణ మానిటోబాలోని స్టెయిన్‌బాచ్ సౌత్ విమానాశ్రయానికి సమీపంలో హార్వ్స్ ఎయిర్ పైలట్ స్కూల్ ఉపయోగించే రన్‌వే నుంచి 400 మీటర్ల దూరంలో  ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: KA Paul: బెట్టింగ్‌ యాప్స్‌లో సెలబ్రిటీలపై కేసు.. బీజేపీతో ఉండే వాళ్ళను వదిలేస్తారా..?

‘‘శ్రీహరి సుకేశ్ విషాదకరంగా మరణించడం పట్ల తీవ్ర దుఃఖంతో సంతాపం వ్యక్తం చేస్తున్నాము. ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. అవసరమైన అన్ని సహాయాన్ని అందించడానికి కాన్సులేట్ మృతుల కుటుంబం, పైలట్ శిక్షణ పాఠశాల మరియు స్థానిక పోలీసులతో సంప్రదిస్తోంది.’’ అని కాన్సులేట్ జనరల్ ఒక పోస్ట్‌లో తెలిపారు.

హార్వ్స్ ఎయిర్ పైలట్ శిక్షణ పాఠశాల అధ్యక్షుడు ఆడమ్ పెన్నర్ ప్రకారం.. ప్రమాద సమయంలో ఇద్దరు విద్యార్థి పైలట్లు చిన్న సెస్నా సింగిల్-ఇంజన్ విమానాల్లో టేకాఫ్ మరియు ల్యాండింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారని తెలిపారు. ఇద్దరు పైలట్లు ఒకేసారి ల్యాండ్ చేయడానికి ప్రయత్నించి చిన్న రన్‌వే నుంచి కొన్ని వందల గజాల దూరంలో ఢీకొన్నట్లు చెప్పారు. దీంతో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. సంఘటనాస్థలిలోనే ఇద్దరూ చనిపోయారని.. అందులో ప్రయాణికులు ఎవరూ లేరని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు తెలిపారు.

 

Exit mobile version