Site icon NTV Telugu

Earthquake: చైనా, బంగ్లాదేశ్, దావోస్‌లోనూ భూప్రకంపనలు

Earthquakemyanmar

Earthquakemyanmar

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు భారీ భూకంపాలతో హడలెత్తిపోయాయి. ఈ ఉదయం బ్యాంకాక్, మయన్మార్‌లో పెద్ద ఎత్తున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.7గా నమోదైంది. దీంతో భారీ అంతస్తుల బిల్డింగ్‌లు నేలకూలిపోయాయి. భయంతో జనాలు పరుగులు తీశారు. ఈ భూప్రకంపనలు బ్యాంకాక్, మయన్మార్‌తో పాటు భారత్, చైనా, బంగ్లాదేశ్, దావోస్‌‌లో భారీ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాల్లోని ప్రజలు బయటకు పరుగులు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే ఆయా ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. థాయ్‌లాండ్, మయన్మార్ ప్రభుత్వాలు అత్యవసర పరిస్థితిని విధించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాయి. ఇక ఆస్తి, ప్రాణ నష్టంపై మాత్రం ఇంకా వివరాలు రాలేదు. రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు.

భారత్‌లో రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైనట్లుగా తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా కోల్‌కతా, రాంచీ, త్రిపుర, అస్సాం, పాట్నాలో భూప్రకంపనలు సంభవించాయి. దీంతో భయంతో విద్యార్థులు, అధ్యాపకులు క్లాస్ రూమ్‌లోంచి బయటకు వచ్చేశారు. అలాగే అధికారులు కూడా కార్యాలయాల్లోంచి ఇళ్లకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

https://twitter.com/niannelynn/status/1905507150300119055

 

 

Exit mobile version