Srilanka Crisis: ఉద్యోగాలు లేక ప్రత్యామ్నాయం దొరక్క.. ఒళ్లు అమ్మకుంటున్న మహిళలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lankan crisis- women into prostitution: శ్రీలంకలో రాజకీయ అధికారం మారినా.. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ ప్రజలు నిత్యావసరాలు దొరకడం గగనం అయిపోయింది. పెట్రోల్, డీజిల్ కోసం పెద్దపెద్ద క్యూల్లో నిలబడుతున్నారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అన్ని రంగాలను దెబ్బతీసింది. ఫలితంగా చాలా మంది ఉద్యోగం, ఉపాధి కోల్పోయారు. పని చేసేందుకు సిద్ధంగా ఉన్న పని లభించని పరిస్థితి ఏర్పడింది.
Read Also: UK PM Race: రిషి సునక్ కు షాక్.. లిజ్ ట్రస్ కే గెలుపు అవకాశాలు ఎక్కువన్న సర్వే
Also Read
శ్రీలంక ఆర్థిక సంక్షోభం మహిళల పాలిట నరకంగా మారుతోంది. ఆర్థిక సంక్షోభం, పేదరికం కారణంగా చాలా మంది మహిళలు వ్యభిచార కూపంలోకి నెట్టివేయబడుతున్నారు. మహిళ పరిస్థితులను వాడుకుని అక్కడి స్పా యజమానులు, నిర్వాహకులు మహిళలతో సెక్స్ వర్క్ చేయిస్తున్నారు. కుటుంబం గడవాలన్నా.. పిల్లలకు తిండి పెట్టాలన్నా, మనసుకు ఇష్టం లేకపోవయినా మహిళలు తమ శరీరాలను అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వస్త్రపరిశ్రమల కుంటుపడటంతో ఆ రంగంలో పనిచేసే మహిళలు వ్యభిచారంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారి కుటుంబాలకు వేరే ప్రత్యామ్నాయం, ఆదాయం లేకపోవడంతో చివరికి వారి భర్తలు కూడా వారిని విడిచిపెడుతున్నారు. ఇంతకుముందు పట్టణాలకు వచ్చి చిన్నచిన్న ఉద్యోగాలు చేసే మహిళలకు ఉపాధి లేకుండా పోయిందని.. వారు గ్రామాలకు తిరిగి వెళ్లే పరిస్థితి లేదని.. ఖర్చులు విపరీతంగా పెరగడంతో సంపాదన కోసం సెక్స్ వర్క్ ను ఆశ్రయిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో గర్భం దాలుస్తున్నారని స్టాండ్-అప్ మూవ్‌మెంట్ లంక ఎన్జీవోకు సంబంధించి అశిలా దండేనియా చెబుతున్నారు.
గతేడాని డిసెంబర్ నుంచి చాలా మంది మహిళలు టెక్స్ టైల్స్ పరిశ్రమల్లో ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో ఆదాయం లేకున్న సమయాల్లో వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని పలు స్పా నిర్వాహకులు మహిళలను సెక్స్ వర్కర్లుగా మారుస్తున్నారని..మహిళలు చెబుతున్నారు. చివరకు నిత్యవసరాల కోసం స్థానికంగా ఉండే దుకాణ యజమానులు కూడా మహిళలను శారీరకంగా దోచుకుంటున్నారు.
తాజావార్తలు
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
-
UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!