NTV Telugu Site icon

Srilanka Crisis: ఆందోళనలతో దిగి వచ్చిన మహిందా రాజపక్సే!

Mahindra Rajapaksa

Mahindra Rajapaksa

శ్రీలంకలో దారుణపరిస్థితులు కొనసాగుతున్నాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తూనే వున్నారు. కొలంబోలోని పార్లమెంటు భవనం ముందు అండర్ వేర్లతో ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్ ధరలు సామాన్యుడికి అందడం లేదు. ఎప్పుడూ లేనివిధంగా ధరలు అంతరిక్షాన్ని తాకాయి. దేశం దివాలా అంచున నిలిచింది. దీంతో ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ప్రజలు, విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే, ప్రధాని మహిందా రాజపక్సే లను రాజీనామా చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.

ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్సే అత్యవసర పరిస్థితి కొనసాగిస్తున్నారు. ఇదిలా వుంటే… ప్రధాని మహిందా రాజపక్సే తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాలతో పాటు సొంత క్యాబినెట్ లోని కొంతమంది మహిందా రాజపక్సేను రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో దేశంలో ఆందోళనలు తగ్గించేందుకు ప్రధాని పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అధ్యక్షుడు గొటబాయ సూచన మేరకు మహింద సానుకూలంగా స్పందించారు. మహింద రాజపక్స ఇవాళ రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది.

Srilanka Crisis: అండర్ వేర్లతో నిరసన.. గోటబాయ రాజీనామాకు డిమాండ్