Site icon NTV Telugu

Srilanka Crisis: మరోసారి రణరంగంగా మారిన శ్రీలంక.. పారిపోయిన అధ్యక్షుడు

Srilanka Crisis

Srilanka Crisis

పీకల్లోతు ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక మరోసారి రణరంగంగా మారింది. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇంట్లోకి ఆందోళనకారులు దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి నుంచి పరారైనట్లు సమాచారం. దీంతో ఆందోళనకారులపై శ్రీలంక సైన్యం టియర్ గ్యాస్ ప్రయోగించింది. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సైన్యం లాఠీఛార్జీకి దిగింది. ఈ ఘటనలో 26 మంది గాయాలైనట్లు సమాచారం. నలుగురు జవాన్లకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.

Shinzo Abe: షింజో అబేను అందుకే కాల్చేశా.. విచారణలో వెల్లడించిన నిందితుడు

శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా కోలుకోవ‌డం లేదు. విదేశీ మారక ద్రవ్యం లేక‌పోవ‌డంతో ఆ దేశ అవ‌స‌రాల‌కు స‌రిప‌డే ఇంధ‌నాన్ని కూడా అక్కడి ప్రభుత్వం కొనుగోలు చేయ‌లేక‌పోతోంది. దీంతో ప్రజ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కొన్ని రంగాల‌కు అస్సలు ఇంధ‌నాన్ని కేటాయించ‌డం లేదు. ఈ ఇంధ‌న సంక్షోభ ప్రభావం ముఖ్యంగా విద్యా వ్యవ‌స్థపై ప‌డింది. జూలై 4వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు ప్రక‌టించిన విషయం తెలిసిందే. ఈ సెలవులు వారం పాటు కొనసాగుతాయని శ్రీలంక విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. ఈ వారం రోజుల్లో పిల్లలు కోల్పోయిన సిల‌బ‌స్ వ‌చ్చే వారం క్లాసుల్లో క‌వ‌ర్ అవుతాయ‌ని అన్నారు. కాగా అంత‌కు ముందు కూడా జూన్ 18వ తేదీన శ్రీలంక ప్రభుత్వం వారం రోజుల పాటు అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సెలవులు ముగిసిపోయి పాఠశాలలు తెరవగా.. మళ్లీ అలాంటి పరిస్థితులే తలెత్తాయి.

శ్రీలంకలో తాజా పరిస్థితిపై అత్యవసర పార్లమెంట్‌ ఏర్పాటుకు ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. సమస్య పరిష్కారానికి ప్రతిపక్ష నేతలందరు పార్లమెంటుకు రావాలని ప్రధాని రణిల్ విక్రమసింఘే కోరారు. దేశంలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై పార్లమెంట్‌లో చర్చించనున్నారు.

Exit mobile version