ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఆందోళనలు ఉగ్రరూపం దాల్చడంతో.. లంక తగలబడిపోతోంది… ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం తీవ్ర ఉద్రిక్తతలు, హింసాత్మక ఘటనలకు దారి తీసింది.. ఆగ్రహంతో ఊగిపోతోన్న ప్రజలు.. అధికార పార్టీకి చెందిన పలువురు రాజకీయ నాయకుల ఇళ్లకు నిప్పెపెట్టారు.. పలువురు మంత్రులు, ఎంపీల ఇళ్లకు సైతం నిప్పుపెట్టారు. సోమవారం ప్రధానమంత్రి పదవికి మహింద రాజపక్సే రాజీనామా చేశారు. దాంతో ఆయన మద్దతుదారులు శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిపై దాడి చేయంతో.. హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి.
Read Also: CM Jagan: రోడ్లు, మెట్రో రైలుపై అధికారులకి కీలక ఆదేశాలు
ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. కురునాగళలోని మహేంద్ర రాజపక్సే ఇంటిని తగులబెట్టి ఆందోళనకారులు, మంత్రి కంచన విజేశేఖరా ఇంటికి, ఎంపీ అరుండిక ఫెర్నాండో ఇంటికి నిప్పు పెట్టారు.. ఇక, ఎంపీ తిస్సాకుతియర్చి కు చెందిన షాపింగ్ మాల్ ధ్వంసం చేసి నిప్పు పెట్టిన ఆందోళనకారుల, కెగల్లులోని ఎంపీ మహిపాల హెరాట్ ఇంటికి నిప్పు అట్టించారు.. ఎంపీలు, మంత్రులు ఇళ్లకు నిప్పు పెట్టి ఇంటిముందున్న కార్లను సైతం తగలబెట్టి నిరసన తెలుపుతున్నారు. హింస చెలరేగడంతో.. భయాందోళనలకు లోనైన పోలీసులు.. పోలీస్ స్టేషన్లని వదిలిపెట్టి ఇళ్లకు వెళ్లిపోయారు.
మరోవైపు, హింస చెలరేగిన ప్రాంతాల్లో టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు సైనికులు, ఎంపీలు, మంత్రులను నివాసాల నుంచి రహస్య ప్రదేశాలకు తరలించింది ఆర్మీ.. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే, మాజీ ప్రధాని మహేంద్ర రాజపక్సేని రాత్రికి కొలంబో నుంచి వేరే దేశానికి తరలించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే గోటబయ అధికార నివాసానికి కొద్దీ దూరంలో వేలాదిమంది ప్రజల ఆందోళన చేస్తున్నారు.. ఏ నిమిషమైనా అధ్యక్ష భవనాన్ని ముట్టడించే అవకాశం ఉన్న నేపథ్యంలో.. సైన్యం అధ్యక్ష భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది.
