Petrol-Diesel Price Hike: ఆ దేశంలో లీటర్ పెట్రోల్ రూ. 434, డీజిల్ రూ. 407.
- ఇరాన్ ఉద్రిక్తతలతో సంక్షోభంలో ప్రపంచ చమురు సరఫరా..
- శ్రీలంకలో భారీగా పెరిగిన ఇంధన ధరలు..
- పెట్రోల్ లీటరుకు రూ.434, డీజిల్ రూ.407..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol-Diesel Price Hike: పశ్చిమాసియా సంక్షోభం, ఇరాన్ యుద్ధం ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోకి నెట్టేసింది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంకలతో పాటు భారత్ ఇంధన భద్రతను ఇరాన్ యుద్ధం ప్రభావితం చేసింది. ప్రపంచం చమురులో 20 శాతం అవసరాలకు కీలకమైన సముద్ర మార్గంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’లో ఇరాన్, అమెరికా ఘర్షణ పడుతున్నాయి. దీంతో గల్ఫ్ నుంచి ఆయిల్ రవాణా చాలా వరకు తగ్గిపోయింది.
ఇదిలా ఉంటే, భారత్‌లో ఇటీవల పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు పెరిగాయి. ఇతర దేశాలతో పోలిస్తే మన వద్ద చమురు ధరలు తక్కువగానే పెరిగాయి. కానీ శ్రీలంకలో మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల్ని భారీ స్థాయిలో పెంచింది. శ్రీలంకలో లీటరు పెట్రోల్ ధర ఇప్పుడు రూ.434కి పెరగగా, డీజిల్ ధర లీటరుకు రూ.407కి చేరుకుంది. శ్రీలంక ప్రభుత్వ రంగ పెట్రోలియం సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (సీపీఎస్) శనివారం కొత్త ధరలను ప్రకటించింది. ఇవి ఆదివారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రపంచ చమురు సంక్షోభం శ్రీలంకను కుదేలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరిలో శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ. 293 ఉండగా, ఇది ఇప్పుడు రూ. 434కు పెరిగింది.
Also Read
- China: మళ్లీ కరోనా కలకలం.. చైనాలో 79 వేల కొత్త కేసులు.. భారత్‌కు డేంజరేనా?
- Trump: ఇరాన్ దగ్గర ఎప్పటికీ అణ్వాయుధం ఉండదు.. నెతన్యాహుతో భేటీకి ముందు ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Trump-Netanyahu: ట్రంప్-నెతన్యాహు విభేదాలు.. దేనికోసమంటే..!
- PoK Protest: పీఓకేలో పాక్ సైన్యం అరాచకం.. కాల్పుల్లో 20 మంది ఉద్యమకారులు మృతి..
తాజావార్తలు
-
KTR : బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో తెలంగాణ బిడ్డ.. ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
-
Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్‌కు మరో మంత్రి పదవి ఆఫర్! బీజేపీ క్లారిటీ
-
China: మళ్లీ కరోనా కలకలం.. చైనాలో 79 వేల కొత్త కేసులు.. భారత్‌కు డేంజరేనా?
-
ROKO: రోహిత్, కోహ్లీలపై షాకింగ్ కామెంట్స్ చేసిన పాక్ దిగ్గజం… 2027 వరల్డ్ కప్‌లో అసలు ఏం జరగబోతోంది..?
-
Plastic Notes: దేశ కరెన్సీ చరిత్రలో మరో కీలక మార్పు.. ప్లాస్టిక్ నోట్ల ఎంట్రీకి రంగం సిద్ధం!
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!