Sri Lanka: ఘోర ప్రమాదం.. కొండపై నుంచి బస్సు పడి 21 మంది మృతి..

  • శ్రీలంకలో ఘోర బస్సు ప్రమాదం..
  • కొండపై నుంచి పడిపోయిన బస్సు..
  • 21 మంది మరణం, పలువురికి గాయాలు..
Srilanka

Srilanka

Sri Lanka: శ్రీలంకలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం శ్రీలంకలోని తేయాకు పండించే కొండ ప్రాంతంలో ఒక ప్రయాణికుల బస్సు కొండపై నుంచి జారిపడి 21 మంది మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో 36 మంది గాయపడ్డారని అక్కడి అధికారులు తెలియజేశారు. ఈ ప్రమాదం దేశ రాజధాని కొలంబోకు తూర్పున 140 కి.మీ దూరంలో ఉన్న కోట్మలే పట్టణానికి సమీపంలో, ఈ రోజు తెల్లవారుజామున జరిగింది.

Read Also: BrahMos: పాకిస్తాన్‌‌పై “బ్రహ్మోస్‌”తో భారత్ దాడి.!

రహదారులు, రవాణా డిప్యూటీ మినిస్టర్ ప్రసన్న గుణసేన మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో 21 మంది మరణించినట్లు ధ్రువీకరించారు. మొత్తం 77 బౌద్ధ యాత్రికులు బస్సులో ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు కెపాసిటీ కన్నా 25 మంది అదనంగా తీసుకెళ్లడంతోనే ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన బస్సు శ్రీలంక ప్రభుత్వ రవాణా సంస్థకు చెందినదిగా గుర్తించారు.