NTV Telugu Site icon

Sri Lanka Crisis: మరింతగా దిగజారిన శ్రీలంక పరిస్థితి..

Sri Lanka

Sri Lanka

శ్రీలంకలో పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి.. రెండు రోజుల పాటు పెట్రోలు, డీజల్‌ అమ్మకాలకు బ్రేక్‌ పడింది… స్టాక్ లేకపోవటంతో కారణంగా చెబుతోంది లంక ప్రభుత్వం.. మరోవైపు గ్యాస్ సిలెండ్ కీ నాలుగు రోజుల పాటు బ్రేక్ వేసింది సర్కార్.. ప్రజలు సహకరించాలని ప్రధాని రణిల్ విక్రమ సింఘె విజ్ఞప్తి చేశారు.. మరోవైపు, శ్రీలంకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్సను వ్యతిరేకిస్తూ శ్రీలంక పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. నూతన ప్రధానిగా రణిల్‌ విక్రమ సింఘె బాధ్యతలు స్వీకరించాక.. శ్రీలంక పార్లమెంట్‌ మొదటిసారిగా సమావేశం అయింది. ఈ ప్రత్యేక సమావేశంలో తమిళ్‌ నేషనల్‌ అలయన్స్‌ ఎంపీ సుమంథిరన్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరిగింది. మెజారిటీ సంఖ్యలో 119 మంది ఎంపీలు రాజపక్సపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించారు. 68 మంది మాత్రమే దానికి మద్దతు పలికారు. దీంతో అధ్యక్షుడు రాజపక్సపై పెట్టిన తీర్మానం వీగిపోయింది.

Read Also: CM KCR:ఫలితాలు ఊరికే రావు.. ప్రజల సంక్షేమం దిశగా ప్రభుత్వం