Site icon NTV Telugu

Sri Lanka Economic Crisis : పెట్రోల్‌ కోసం కొట్టకుంటున్న లంక వాసులు..

Petrol

Petrol

ఆర్థిక సంక్షోభంతో శ్రీలంకలో కొట్టుమిట్టాడుతోంది. రోజురోజుకు శ్రీలంకలో పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. అయితే.. ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌ నిలువలు కూడా లేకపోవడంతో శ్రీలంకలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదరుర్కొంటున్నారు. కోలంబోలో పరిస్థితి దారుణంగా తయారైంది. పెట్రోలు బంక్‌ వద్ద లంకా వాసుల ఘర్షణలకు దిగుతున్నారు.

పెట్రోల్, డీజిల్‌ కోసం ఒకరిని ఒకరు క్యాన్ లతో లంకా వాసులు కొట్టుకున్నారు. మరో మూడు రోజులు పెట్రోలు, డీజిల్‌ దేశంలో ఉండదని లంక ప్రభుత్వం ప్రకటించింది. కొనుగోలు చేయడానికి రెండు రోజుల సమయం పడుతుందని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలా ఉంటే.. కొన్ని చోట్ల బ్లాక్‌లో పెట్రోల్‌, డీజిల్‌ను అమ్ముతున్నారు. బ్లాక్ లో 1200 నుండి 1500 పెట్రోలు, డీజిల్‌ ధరలు పలుకుతున్నాయి. కరెంట్ కోతల నేపధ్యంలో తప్పసరి పరిస్థితులలో హోటల్స్…ప్రైవేటు హాస్పటల్స్ కొనుగోలు చేసుకుంటున్నాయి.

Exit mobile version