Sri Lanka Economic Crisis: చేతులెత్తేసిన శ్రీలంక.. అప్పులు చెల్లించలేం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక చేతులెత్తేసింది.. అప్పులు కట్టడం మా వల్ల కాదు బాబోయ్ అంటూ తేల్చేసింది… ఇప్పటికే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా కోసం ఒత్తిడి పెరుగుతోంది. అధ్యక్షుడి సెక్రటేరియట్ వద్ద నిరసనలు హోరెత్తాయి. నిరసనకారులు ‘గో హోమ్ గొట’ అంటూ అధ్యక్షుడి రాజీనామా కోసం పెద్దపెట్టున నినాదాలు చేశారు. తమకు కరెంట్, గ్యాస్, పెట్రోల్, మెడిసిన్ లేవు… అందుకే ఆందోళన చేస్తున్నామని తెలిపారు. రాజపక్సే రాజీనామా చేయాల్సిందేనని నిరసనకారులు పట్టుబట్టారు. అయితే, అధ్యక్షుడి రాజీనామా కోసం డిమాండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రతిపక్ష పార్టీలు దేశాన్ని అరాచకంలోకి నెట్టేస్తున్నాయని శ్రీలంక ప్రభుత్వం పేర్కొంది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్న సమయంలో ‘కొవిడ్ లాక్డౌన్’కారణంగా విదేశీ మారక నిల్వలు మరింత క్షీణించాయని మహింద రాజపక్స పేర్కొన్నారు. ఇదే సమయంలో.. శ్రీలంక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది..
Read Also: Peddireddy: పవర్ హాలిడే లేకుండా చేయడమే లక్ష్యం..
Also Read
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
విదేశాలకు చెల్లించాల్సిన $51 బిలియన్ల విదేశీ రుణాన్ని చెల్లించలేదు శ్రీలంక.. 1948లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి అత్యంత బాధాకరమైన తిరోగమనంలో ఉన్న ఆ దేశంలో 22 మిలియన్ల మంది ప్రజలకు విద్యుత్, ఆహారం, ఇంధనం అన్నీ సమస్యగా మారాయి.. అంతర్జాతీయ మానిటరీ ఫండ్ బెయిలౌట్‌కు ముందు దేశం.. విదేశీ ప్రభుత్వాల నుండి రుణాలతో సహా అన్ని బాహ్య బాధ్యతలపై డిఫాల్ట్ అవుతుందని శ్రీలంక ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది… తమ ఆర్థిక స్థితి మరింత దిగజారకుండా నిరోధించడానికి ప్రభుత్వం చివరి ప్రయత్నంగా మాత్రమే అత్యవసర చర్యను తీసుకుంటుందని తెలిపింది.. రుణదాతలు తమకు చెల్లించాల్సిన ఏవైనా వడ్డీ చెల్లింపులను క్యాపిటలైజ్ చేసుకోవచ్చు లేదా శ్రీలంక రూపాయల్లో చెల్లింపును ఎంచుకోవచ్చు అని వెల్లడించింది. ప్రభుత్వం తన విదేశీ కరెన్సీ నిల్వలను కాపాడుకోవడానికి మరియు ఇప్పుడు డిఫాల్ట్ చేసిన అప్పులను తీర్చడానికి వాటిని ఉపయోగించడానికి దిగుమతి నిషేధాన్ని విధించింది. అయితే, ప్రభుత్వ నిర్వహణ లోపం, సంవత్సరాల తరబడి పేరుకుపోయిన రుణాలు, అనాలోచిత పన్ను తగ్గింపుల వల్ల సంక్షోభం మరింత తీవ్రమైందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!