దాయాది దేశం పాకిస్థాన్‌లో మరో సైనిక తిరుగుబాటు తప్పదని వార్తలు షికార్లు చేస్తున్నాయి. సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తిరుగుబాటు చేసి పాకిస్థాన్ అధ్యక్షుడయ్యాడు. 1999లో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 2001-2008 వరకు అధ్యక్షుడిగా కొనసాగారు. అభిశంసన తీర్మానానికి ముందు పదవి నుంచి ముషారఫ్ వైదొలిగారు.
అప్పట్లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ముషారఫ్ కూల్చేసినట్లుగా ఇప్పటి సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ కూడా అదే రీతిగా తిరుగుబాటు చేయనున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. లాహోర్‌లో వెలసిన ఒక ఫ్లె్క్సీ అందుకు నిదర్శనంగా నిలిచింది. అప్పట్లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ముషారఫ్ కూల్చేస్తే.. ఇప్పుడు నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని అసిమ్ మునీర్ కూల్చేయడం ఖాయమని పెద్ద ఎత్తున వదంతులు నడుస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Pappu Yadav: ప్రధాని పోస్ట్‌ను క్షణంలోనే తిరస్కరించారు.. రాహుల్‌గాంధీ మేధావి అంటూ పప్పు యాదవ్ ప్రశంసలు
అసిమ్ మునీర్ ఈ మధ్య కాలంలో విదేశాలకు ఎక్కువగా తిరుగుతున్నారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో కలిసి మునీర్ గల్ఫ్ దేశాలు, ఆసియా దేశాలకు తిరుగుతున్నారు. ఇప్పుడు షెహబాజ్ షరీఫ్ లేకుండానే మునీర్ శ్రీలంక, ఇండోనేషియా పర్యటనలకు వెళ్తున్నారు. అంటే త్వరలోనే సైనిక తిరుగుబాటు తప్పదని వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ అధ్యక్ష పదవిని చేజిక్కించుకుని… అనంతరం ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కీలుబొమ్మగా చేయొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Jairam Ramesh: ఏదో బలమైన కారణమే ఉంది.. ధన్‌ఖర్ రాజీనామాపై జైరాం రమేష్ వ్యాఖ్య
ప్రస్తుతం పాకిస్థాన్ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ ఉన్నారు. ఆ స్థానాన్ని మునీర్‌తో భర్తీ చేసేందుకు తీవ్రస్థాయిలో కుట్రలు జరుగుతున్నట్లుగా నివేదికలు అందుతున్నాయి. త్వరలోనే ఇస్లామాబాద్‌లో మరో తిరుగుబాటు తప్పదని భయాందోళనలు కొనసాగుతున్నాయి. ఊహాగానాలే అయినప్పటికీ.. ఒకవేళ అదే నిజమైతే పాకిస్థాన్ రాజకీయ ముఖచిత్రం మారిపోతుంది. మునీర్ అధ్యక్షుడు కాగానే షెహబాజ్ షరీఫ్ స్థాయి అమాంతంగా పడిపోతుంది. ఉత్సవ వ్యక్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది.
అసిమ్ మునీర్ నిశ్శబద్దంగా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు అంతర్జాతీయంగా ఊహాగానాలు వినిపిస్తు్న్నాయి. ఇటీవల మునీర్ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా వైట్‌హౌస్‌లో గౌరవ మర్యాదలు లభించాయి. ట్రంప్ స్వయంగా ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మునీర్‌తో కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం అందుతోంది.
ఒకవేళ అసిమ్ మునీర్ పాకిస్థాన్ అధ్యక్షుడైతే భారత్‌తో మాటిమాటికీ కయ్యాలకు దిగే అవకాశం ఉంటుంది. ఉగ్రవాద సంస్థలను రెచ్చగొట్టి.. భారత్‌పైకి ఉసిగొల్పే అవకాశం ఉంది. గతంలో కాశ్మీర్‌పై రెచ్చగొట్టే ప్రసంగం చేసిన తర్వాతే పహల్గామ్‌లో ఉగ్ర దాడి జరిగింది. ముష్కరులు 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఇప్పుడు మునీర్ అధ్యక్షుడైతే మరింత ప్రమాదమని భారత్ భావిస్తోంది. తాజా పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.
