Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- స్మిత్ మచ్చర్ ధైర్యానికి అమెరికా కాంగ్రెస్‌లో ప్రత్యేక గుర్తింపు
- US ప్రతినిధుల సభలో ప్రత్యేక తీర్మానం
- మద్దతు తెలిపిన రిపబ్లికన్, డెమోక్రటిక్ ప్రతినిధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smit Machchhar: ప్లైదుబాయ్ విమానాన్ని ప్రమాదం నుంచి రక్షించి, 180 మంది ప్రయాణికుల్ని కాపాడిన భారత పైలట్ స్మిత్ మచ్చర్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇటీవల, దుబాయ్ నుంచి ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో కో-పైలట్, పైలట్ స్మిత్‌పై దాడి చేసి విమానాన్ని కూల్చాలనుకున్నాడు. అయితే, దాడిని తట్టుకుని, కాక్‌పిట్ డోర్ తెరవడంతో ప్రయాణికులు కో-పైలట్‌ను బంధించే అవకాశం లభించింది. చివరకు సౌదీ అరేబియాలోని ఒక చిన్న ఎయిర్‌పోర్టులో విమానం సురక్షితంగా ల్యాండైంది.
ఇదిలా ఉంటే, అమెరికా చట్టసభ కాంగ్రెస్‌లో స్మిత్ మచ్చర్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. విమానంలోని ప్రయాణికుల్ని కాపాడేందుకు స్మిత్ చేసని ప్రయత్నాలను ప్రశంసిస్తూ అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు చెందిన సభ్యులు ఈ తీర్మానానికి మద్దతు ప్రకటించారు. న్యూజెర్సీకి చెందిన డెమొక్రటిక్ ప్రతినిధి జోష్ గోట్హైమర్ దీనిని ప్రవేశపెట్టగా, మైక్ మెక్కాల్, డాన్ బేకన్ సహ-ప్రతిపాదకులుగా ఉన్నారు. తీర్మానం స్మిత్ మచ్చర్‌తో పాటు ఫ్లైట్‌లోని ఆఫ్-డ్యూటీ పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, ప్రయాణికుల ధైర్యాన్ని కూడా ప్రశంసించింది.
Also Read
ఇప్పటికే స్మిత్ సాహసాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కొనియాడారు. ప్రధాని నరేంద్రమోడీ స్మిత్‌తో వీడియో కాల్లో మాట్లాడారు. యూఏఈ క్రౌన్ ప్రిన్స్ స్మిత్‌ను ఆస్పత్రిలో పరామర్శించారు. ఈ ఘటనపై యూఏఈ, సౌదీ అరేబియాలు దర్యాప్తు జరుపుతున్నాయి. అమెరికా, ఇజ్రాయిల్‌లు సమాచారం ఇవ్వాలని కోరాయి. కోపైలట్‌ను ఒమన్‌కు చెందిన హమ్మామీగా గుర్తించారు. గాయపడిన స్మిత్ మచ్చర్ దుబాయ్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.
తాజావార్తలు
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!