Montana Pileup: అగ్రరాజ్యం అమెరికాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ధూళి తుపాను కారణంగా హార్డిన్ సమీపంలోని మోంటానాలోని ఇంటర్‌స్టేట్ 90 ప్రాంతంలో 21 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పలు వాహనాలు దెబ్బతిన్నాయి.ప్రమాద సమయంలో గంటకు 64 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు.పెద్ద ఎత్తున దుమ్ము చెలరేగి రోడ్డు కనిపించక పోవడం వల్ల వాహనాలు ఢీకొన్నట్లు పేర్కొన్నారు. వాహనాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో మోంటానా ఎక్స్‌ప్రెస్ హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.ఫలితంగా.. కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్డుపై నిలిపోయాయి. గాయపడిన వారి గురించి ఎలాంటి సమాచారం విడుదల చేయలేదు.
ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల సృష్టికర్తలెవరో తెలుసా..?
హార్డిన్ సమీపంలో జరిగిన ప్రమాదం గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని గవర్నర్ జియాన్‌ఫోర్ట్ ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన అధికారులకు, స్థానికులకు కృతజ్ఞతలు తెలిపారు. హార్డిన్‌కు పశ్చిమాన 40 మైళ్ల దూరంలో మెరుపులతో కూడిన గాలివానలు పడ్డాయని వాతావరణ శాస్త్రవేత్త టాడ్ ఛాంబర్స్ తెలిపారు.