US: అమెరికా పాఠశాల హాకీ ఆటలో కాల్పులు.. ముగ్గురు మృతి

  • అమెరికా పాఠశాల హాకీ ఆటలో కాల్పులు
  • ముగ్గురు మృతి.. ఒకరి పరిస్థితి విషమం
  • వీడియో వైరల్
Us3

Us3

అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. రోడ్ ఐలాండ్‌లో జరిగిన పాఠశాల పిల్లల హాకీ ఆటలో కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పులతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. భయంతో అందరూ బయటకు పారిపోయారు. ఇక ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Gold-Silver Rates: గోల్డ్ లవర్స్‌కు పండగే.. పండగ.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు

రోడ్ ఐలాండ్‌లోని డెన్నిస్ ఎం.లించ్ అరీనాలో ఐస్ హాకీ ఆట జరుగుతోంది. ఇంతలో ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు రావడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే రక్తసిక్తం అయింది. భార్య, పిల్లలపై కాల్పులు జరిపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం భార్య, ఒక బిడ్డ, భర్త మరణించగా.. మరొక బిడ్డ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన జరగగానే అందరూ పారిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Trump: ‘‘దాచడానికి ఏముంది?’’ ఎప్‌స్టీన్‌తో ఎలాంటి సంబంధం లేదన్న ట్రంప్

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇది ఫ్యామిలీ గొడవగా తేల్చారు. భార్య, పిల్లలను కాల్చి చంపిన తర్వాత భర్త తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ప్రస్తుతం ముగ్గురు చనిపోగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు.