Philippines shooting: యూనివర్సిటీలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Philippines shooting: ఫిలిప్పీన్స్‌లోని యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ ఈవెంట్లో దారుణం జరిగింది. ఆ దేశ రాజధాని మనీలాలోని యూనీవర్సిటీ క్యాంపస్ ఆదివారం మధ్యాహ్నం జరిగిన కాల్పులు కలకలం రేపాయి. ఓ వ్యక్తి కాల్పులకు తెగబడగా.. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఒక కారును తీసుకుని తప్పించుకోవడానికి ప్రయత్నించాడని కానీ పోలీసులకు పట్టుబడ్డాడని ఫిలిప్పీన్ నేషనల్ పోలీసులు తెలిపారు. విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. ఈ హత్యకు గురైన వ్యక్తుల్లో ఓ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డు, ఓ విద్యార్థిని ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నట్టు స్థానిక అధికారులు తెలిపారు.
Three Days …Six Deaths: మూడురోజులు.. ఆరు ప్రాణాలు బలి
Also Read
- Indonesia: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం .. 209 విమానాలపై ప్రభావం!
- Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్న విమానం క్రాష్, ఇద్దరు మృతి
- US - Iran Tensions: మళ్లీ భగ్గుమన్న అమెరికా - ఇరాన్ ఉద్రిక్తతలు.. మూడు ఆయిల్ ట్యాంకర్లపై అగ్రరాజ్యం దాడి!
- Miss World 2026 Winner: జోహెయిర్రీ మోలా సొంతం చేసుకున్న మిస్ వరల్డ్ కిరీటం.. టాప్ 40లో నికితా పొర్వాల్
అటెనియో డి మనీలా యూనివర్శిటీలో లా విద్యార్థులు, వారి కుటుంబాలు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హాజరుకావాల్సిన స్నాతకోత్సవ వేడుకకు హాజరు కావాల్సిన సమయంలో ఈ ఘటన జరిగింది. స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలెగ్జాండర్ గెస్ముండో హాజరు కావాల్సి ఉండగా.. కాల్పుల ఘటన తర్వాత తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. కాల్పులు జరిగే సమయంలో ఆయన మార్గం మధ్యలో ఉన్నారు. వెనక్కి వెళ్లిపోమని అధికారులు ఆయనకు సూచించారు. అలాగే ఈ ఘటన తర్వాత యూనివర్సిటీని మూసివేశారు. క్యాంపస్ “ప్రస్తుతం లాక్డౌన్లో ఉంది” అని విశ్వవిద్యాలయం తెలిపింది. ఫిలిప్పీన్స్‌లో తుపాకీ నిబంధనలు తక్కువగా ఉన్నప్పటికీ పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాల కాల్పులు చాలా అరుదు అని ఓ అధికార ప్రతినిధి వెల్లడించారు.
తాజావార్తలు
-
Producer Council Elections: ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో సందడి.. ఓటేసిన అగ్ర నిర్మాతలు, యువ హీరోలు!
-
Malaika Arora: అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. 52 ఏళ్ల మలైకా 33 ఏళ్లు వజ్రాల వ్యాపారితో కొత్త జీవితం?
-
Indonesia: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం .. 209 విమానాలపై ప్రభావం!
-
Dhamaal 4: ఓటీటీలో దుమ్మురేపుతున్న 200 కోట్ల అడ్వెంచర్ కామెడీ.. గాంధారిని వెనక్కి నెట్టి నెం.1లో ట్రెండింగ్
-
TFPC Elections : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత.. ఇద్దరు నిర్మాతల మధ్య వాగ్వాదం
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!