Site icon NTV Telugu

Cannes Film Festival : మాపై అత్యాచారం ఆపండి.. మహిళ అర్థనగ్నంగా నిరసన

Cannes Festival

Cannes Festival

ఉక్రెయిన్‌ దేశంపై రష్యా దాడులు చేస్తూనే ఉంది. అంతేకాకుండా.. ఉక్రెయిన్‌లోని మహిళలపై రష్యా సైనికులు అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొందరు ఉక్రెయిన్‌ యువతిలు, మహిళలు మమ్మల్ని రష్యా సైనికులు అత్యాచారం చేశారంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. శుక్రవారం కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సందడిగా కార్యక్రమం జరుగుతోంది. ఇంతలో ఉక్రెయిన్‌ చెందిన మహిళ ఒక్కసారిగా రెడ్‌ కార్పెట్‌పైకి తన దుస్తులను విప్పి.. నిరసన తెలిపింది.

ఆమె శరీరంపై ఉక్రెయిన్‌ జెండా రంగులను వేసుకొని.. ‘‘మాపై అత్యాచారం ఆపండి’’ అని అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపింది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాకయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆమెపై దుస్తులు కప్పి అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదిలా ఉండగా.. కేన్స్ వేడుకల్లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఉక్రెయిన్‌ నుంచి లైవ్‌ శాటిలైట్‌ వీడియో ద్వారా కేన్స్‌ ప్రారంభోత్సవంలో జెలెన్‌ స్కీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పై రష్యా బలగాల దాడుల్లో తమ దేశ పౌరులు వేల సంఖ్యలో చనిపోతుంటే సినీ ప్రపంచం మౌనంగా ఉంటుందా అని ప్రశ్నిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Exit mobile version