Site icon NTV Telugu

Sheikh Hasina vs Yunus: బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని షేక్ హసీనా ప్రతిజ్ఞ.. ముహమ్మద్ యూనస్ కౌంటర్

Bangraldesh

Bangraldesh

Sheikh Hasina vs Yunus: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను త్వరలో బంగ్లాదేశ్‌‌కు తిరిగి వస్తా.. అవామీ లీగ్ పార్టీ కార్యకర్తల హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటానని హెచ్చరించింది. తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు ముహమ్మద్ యూనస్ ఒక టెర్రరిస్ట్ అంటూ ఆరోపించారు. గతేడాది ఆగస్టు 5వ తేదీన వారు నన్ను చంపడానికి యత్నించారని చెప్పారు.. కానీ, నేను బతికి బయటపడ్డాను అని ఆమె పేర్కొన్నారు. బంగ్లాలో అలర్లపై వేసిన అన్ని విచారణ కమిటీలను యూనస్‌‌ క్యాన్సిల్ చేశాడని చెప్పుకొచ్చింది. తనకు ఎదురు తిరిగిన వారిని చంపడానికి టెర్రరిస్టులను విడుదల చేశాడు.. వారు ఇప్పుడు బంగ్లాదేశ్‌‌ను సర్వ నాశనం చేస్తున్నారు.. ఈ ఉగ్రవాదుల ప్రభుత్వాన్ని గద్దె దించాలని డిమాండ్ చేసింది. అవామీ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు సహాయం చేసేందుకు చేయగలిగినదంతా చేస్తానని షేక్ హసీనా హామీ ఇచ్చింది.

Read Also: IMD Warning: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!

ఇక, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యలకు తాత్కాలిక దేశాధినేత మహ్మద్ యూనస్ స్పందించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాన మంత్రిని భారతదేశం నుంచి రప్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. ఆమెను బంగ్లాకు అప్పగించడానికి మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నాం.. హసీనాను వ్యక్తిగతంగా విచారించడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇక, బంగ్లాదేశ్ లో అవామీ లీగ్ పార్టీకి రాజకీయ భవిష్యత్ లేదన్నారు. హత్యలు, బలవంతపు అరెస్టులకు పాల్పడిన వారు తప్పకుండా శిక్ష అనుభవించి తీరాలని యూనస్ వెల్లడించారు.

Read Also: YS Jagan: వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డ్‌ పర్యటన.. కొనసాగుతున్న ఉత్కంఠ!

అయితే, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన నివేదికను కూడా బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత యూనస్ ఉదహరించారు.. షేక్ హసీనా పరిపాలన మానవాళికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిందని ఆరోపించారు. యూఎన్ నివేదిక తర్వాత మాజీ ప్రధానమంత్రి హసీనాను బంగ్లాదేశ్‌కు తిరిగి అప్పగించాలని భారతదేశంపై ఒత్తిడి పెంచుతున్నామని ఆయన అన్నారు.

Exit mobile version