Site icon NTV Telugu

Pakistan: హిందుత్వం ప్రపంచానికి ప్రమాదమట.. భారత్‌పై విషం కక్కిన దాయాది దరిద్రుడు..

Pakistan Pm

Pakistan Pm

Pakistan: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. భారతదేశ ‘‘హిందుత్వ’’ తీవ్రవాదం ప్రపంచానికి ప్రమాదమని అబద్ధాలను ప్రచారం చేశాడు. పాకిస్తాన్ ఉగ్రవాద బాధిత దేశం అని చెబుతూ, జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ సంఘటనను ప్రస్తావిస్తు ‘‘హిందుత్వ తీవ్రవాదం’’ ప్రపంచానికి ముప్పు కలిగిస్తుందని ఆరోపించాడు. అయితే, నిజానికి యూఎన్ అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో పాకిస్తాన్ ఉగ్రవాదులే ఎక్కువగా ఉన్న విషయాన్ని షరీఫ్ మరిచిపోయినట్లు ఉన్నాడు.

Read Also: Suryakumar Yadav: ఐపీఎల్‌లో పరుగుల వరద.. ఆసియా కప్‌లో మాత్రం గుడ్డు! గణాంకాలు చూస్తే షాకే

భారత పాకిస్తాన్ కాల్పుల విరమణపై ట్రంప్ వైఖరిని ప్రశంసిస్తూ, ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ప్రతిపాదించాడు. ట్రంప్‌ను శాంతిని కోరుకునే వ్యక్తివగా అభివర్ణించాడు. ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. ఈ ఏడాది మేలో భారత్ తమపై దాడిచేస్తే వారికి అవమానకరంగా ఓడించామని ప్రగల్భాలు పలికాడు. భారత్ తమ దేశంలోని పౌరులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపించాడు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘సింధుజలాల’’ ఒప్పందాన్ని నిలిపేసింది. దీనిని కూడా షరీఫ్ ఐరాసలో లేవనెత్తాడు. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేయడాన్ని యుద్ధ చర్యకు ప్రాతినిధ్యం వహిస్తుందని బెదిరించే ప్రయత్నం చేశాడు.

Exit mobile version