Site icon NTV Telugu

Mexico Video: మెక్సికోలో కూలిన విమానం.. ఏడుగురు మృతి

Mexico1

Mexico1

మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టోలుకా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పారిశ్రామిక ప్రాంతమైన శాన్ మాటియో అటెన్కోలో ఒక్కసారిగా విమానం కూలిపోయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు.

ఇది కూడా చదవండి: Sankranti Effect : సంక్రాంతికి రైల్వే రిజర్వేషన్లు ఫుల్

సోమవారం విమానం అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా సెంట్రల్ మెక్సికోలో ఒక చిన్న విమానం కూలిపోయి డుగురు మరణించారని మెక్సికో రాష్ట్ర పౌర రక్షణ సమన్వయకర్త అడ్రియన్ హెర్నాండెజ్ తెలిపారు. పారిశ్రామిక ప్రాంతమైన శాన్ మాటియో అటెన్కోలో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. విమానం మెక్సికో పసిఫిక్ తీరంలోని అకాపుల్కో నుంచి బయలుదేరినట్లు పేర్కొన్నారు. ఈ ప్రైవేట్ జెట్ విమానంలో ఎనిమిది మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారని చెప్పారు. అయితే ప్రమాదం జరిగిన కొన్ని గంటల తర్వాత కేవలం ఏడు మృతదేహాలను మాత్రమే వెలికితీసినట్లు తెలిపారు. విమానం సాకర్ మైదానంలో దిగడానికి ప్రయత్నించిందని.. కానీ సమీపంలోని వ్యాపార సంస్థ అయిన మెటల్ పైకప్పును ఢీకొట్టిందని.. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయన్నారు. ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Off The Record : జగ్గారెడ్డి సొంత పార్టీ నేతల మీదే బాంబులు వేయడానికి సిద్దమవుతున్నారా?

ఇక విమాన ప్రమాదం తర్వాత ఆ ప్రాంతంలోని 130 మందిని ఇళ్లు ఖాళీ చేయించి వేరే ప్రాంతానికి తరలించినట్లు శాన్ మాటియో అటెన్కో మేయర్ అనా మునిజ్ మిలెనియో మీడియాకు తెలియజేశారు.

 

Exit mobile version