NTV Telugu Site icon

Canada: ట్రూడోకి గట్టి ఎదురుదెబ్బ.. కీలక స్థానంలో పార్టీ ఓటమి..

Canada

Canada

Canada: కెనడాలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తాకింది. ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న ‘టొరంటో-సెయింట్ పాల్స్’ పార్లమెంట్ స్థానంలో ఓడిపోయింది. గత మూడు దశాబ్ధాలుగా లిబరల్ పార్టీకి ఈ స్థానంలో ఓటమి ఎదురైంది. ఉప ఎన్నికల్లో విపక్ష కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి డాన్ స్టీవార్ట్ గెలుపొందారు. అధికార లిబరల్ పార్టీ 1993 తర్వాత ఇప్పుడే తొలిసారి ఓడిపోయింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన లెస్టీ చర్చి పరాజయం పాలయ్యారు. న్యూ డెమెక్రటిక్ పార్టీ తరుపున పోటీ చేసిన భారతీయ సంతతికి చెందిన అమృత్ పర్హార్ మూడో స్థానంలో నిలిచాడు. చర్చ్‌పై పాల్ 590 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Read Also: Rishi Sunak: అక్రమ వలసలపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ కీలక వ్యాఖ్యలు

అధికార లిబరల్ పార్టీపై కన్జర్వేటివ్ పార్టీ ప్రజాతీర్పును తెలియజేస్తుందని కెనడియన్ మీడియా పేర్కొంది. మరోవైపు ఈ ఓటమి నేపథ్యంలో వెంటనే ముందస్తు ఎన్నికలకు పిలుపునివ్వాలని ప్రతిపక్ష నేత, కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ పియర్ పొయిలీవ్రా డిమాండ్ చేశారు. వరసగా 10 ఎన్నికల్లో ఈ స్థానంలో లిబరల్ పార్టీ విజయం సాధిస్తూ వస్తోంది. అయితే, ఆ స్థానం నుంచి ఎంపీగా ఉన్న కరోలిన్ బెన్నెట్ డెన్మార్ రాయబారిగా నియామకం కావడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఓటమి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని అక్కడి మీడియా చెప్పింది. ద్రవ్యోల్భణం, జీవన వ్యయం సంక్షోభం, హౌసింగ్ క్రైసిస్, పెరుగుతున్న వలసలు ఓటర్లకు అధికార పార్టీపై అసంతృప్తి నెలకొంది.